మే 25వ తేదీ నుండి కాకినాడ జిల్లాలో పులి తప్పించుకు తిరుగుతుంది. బోనులో చిక్కినట్టే చిక్కిన పులి తప్పించుకు తిరుగుతుంది. 11 గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది పులి. పులిని పట్టుకొనేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.
కాకినాడ: మూడు వారాలుగా Kakinada జిల్లా వాసులకు బెంగాల్ Tiger చుక్కుల చూపిస్తుంది. బోనులో చిక్కినట్టే చిక్కి పులి తప్పించుకుంది. తిరిగిన చోట తిరగకుండా పులి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పులిని పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. పులి తిరిగిన ప్రాంతాల్లో Forest Officers కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో పులి తిరిగిన ఆనవాళ్లు రికార్డయ్యాయి. అటవీశాఖాధికారులు పులిని పట్టుకొనేందుకు వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ పులి తప్పించుకు తిరుగుతుంది. పులి తిరుగుతుందనే భయంతో రైతులు పొలాలకు కూడా వెళ్లడం లేదు. ఆవులు, మేకలను చంపి తింటూ ఈ ప్రాంతంలో సంచిరిస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
28 రోజులుగా కాకినాడ జిల్లాలో పులి సంచారం ప్రారంభమైంది. జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాలెం తదితర ప్రాంతాల్లో పులి సంచరించినట్టుగా అధికారులు గుర్తించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఈ ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి పులి కోసం మాంసాన్ని కూడా ఎరగా వేశారు. అయితే బోను వద్దకు వచ్చినట్టే వచ్చిన పులి తిరిగి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను అక్కడే ఏర్పాటు చేసిన Cameraలలో రికార్డయ్యాయి.ఈ పులి సంచారంలో 11 గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. మే 25వ తేదీ నుండి పులి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
undefined
మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని పట్టుకోవాలని అధికారులు బావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పులి అడవిలోకి వెళ్తుందని భావించినప్పటికీ పులి మాత్రం అడవిలోకి వెళ్లకుండా గ్రామాల మధ్యే తిరుగుతుంది., పులిని బంధించే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఈ నెల 11న జిల్లాలోని శంఖవరం మండలం వజ్రకూటం గ్రామ సమీపంలో పెద్దపులి కన్పించిందని స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.
ఆటో డ్రైవర్ కె. నందీశ్వరరావు తన కుటుంబంతో ఏలేశ్వరానికి కుటుంబంతో వెళ్తున్న సమయంలో వజ్రకూటం వద్ద ఆయిల్ ఫాం ప్లాంటేషన్ వద్ద పులిని గమనించాడు. పులి గురించి నందీశ్వరరావు స్థానికులకు ఫోన్ లో సమాచారం ఇచ్చాడు. అయితే ఆటోలోని మహిళలు, పిల్లలు భయంతో కేకలు వేశారు. దీంతో పులి కత్తిపూడి రోడ్డులోని డెయిరీ పారం వైపు వెళ్లిందని ఆయన చెప్పారు.
also read:కాకినాడ జిల్లాలో పులి సంచారం: భయాందోళనలో గ్రామస్తులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పరిసరాల్లో పులి సంచారం సీసీటీవీ పుటేజీల్లో రికార్డైంది.గత నెల 29న ఈ దృశ్యాలను అధికారులు గుర్తించారు. పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. .కాకినాడ జిల్లాలోని పోతులూరు వద్ద పది పశువులను పులి చంపి తింది. దీంతో స్థానిక రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు తమ పొలాల వద్దకు వెళ్లాలంటే పులి ఎప్పుడు ఎక్కడ నుండి వస్తుందని భయపడుతున్నారు. పులి సంచారంానికి సంబంధించి దృశ్యాలు సీసీటీవీ ల్లో రికార్డయ్యాయి. పులిని బంధించేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
పులి సంచరించిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో బోన్లను కూడా ఏర్పాటు చేశారు. వారం రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.పెద్దపులి కోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.