చంద్రగిరిలో ప్రేమ పెళ్లి చేసుకున్న వైద్యురాలు కిడ్నాప్.. తప్పించుకనుని భర్త వద్దకు.. 18 మందిపై కేసు..

Published : Oct 08, 2022, 11:26 AM IST
చంద్రగిరిలో ప్రేమ పెళ్లి చేసుకున్న వైద్యురాలు కిడ్నాప్.. తప్పించుకనుని భర్త వద్దకు.. 18 మందిపై కేసు..

సారాంశం

తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రేమ వివాహం చేసుకన్న డాక్టర్ దంపతుల కథ సుఖాంతం అయింది. యువతిని పోలీసులు ఆమె భర్తతో పంపించారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రేమ వివాహం చేసుకన్న డాక్టర్ దంపతుల కథ సుఖాంతం అయింది. యువతిని పోలీసులు ఆమె భర్తతో పంపించారు. అలాగే యువతి ఫిర్యాదుతో ఆమె తల్లిదండ్రులతో పాటు 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. వృత్తి రీత్యా డాక్టర్‌గా పనిచేస్తున్న మోహన్‌కృష్ణకు గుంటూరుకు చెందిన వైద్యురాలు సుష్మ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని సుష్మ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. 

ఈ క్రమంలోనే సుష్మ తల్లిదండ్రులు గురువారం తెల్లవారుజామున చంద్రగిరిలోని మోహన్‌రెడ్డి కాలనీలోని మోహన్‌కృష్ణ నివాసం నుంచి సొంత కూతురిని కిడ్నాప్ చేశారు. దీంతో మోహన్ కృష్ణ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు మోహన్ కృష్ణ ఇంటికి చేరుకని వివరాలు సేకరించారు. సుష్మ తల్లిదండ్రులు మరో 30 మందితో కలిసి తమ ఇంట్లోకి చొరబడి తన ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేశారని మోహన్ కృష్ణ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరోవైపు కుటుంబ సభ్యుల నిర్బంధం నుంచి తప్పించుకున్న సుష్మ.. తిరిగి భర్త మోహన్ కృష్ణ వద్దకు చేరుకుంది. అనంతరం ఇద్దరు కలిసి శుక్రవారం తిరుపతి ఎస్పీ పి పరమేశ్వర రెడ్డిని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసు రక్షణ కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సుష్మ తల్లిదండ్రులు మరో 30 మందితో కలిసి తమ ఇంట్లోకి చొరబడి తన భార్యను బలవంతంగా కిడ్నాప్ చేశారని మోహన్ కృష్ణ ఆరోపించారు. 

ఈ క్రమంలోనే పోలీసులు.. సుష్మాను ఆమె భర్త మోహనకృష్ణతో పంపించారు. సుష్మ ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులతో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్