నంద్యాలలో కొత్త నినాదం : స్థానికులకే టికెట్టూ ఓటు

Published : Apr 12, 2017, 08:51 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
నంద్యాలలో కొత్త నినాదం : స్థానికులకే టికెట్టూ ఓటు

సారాంశం

నంద్యాల సీటు కోసం భూమా,శిల్ప,ఫరూక్,యస్పీవై రెడ్డి వర్గాల మధ్య తెదేపాలో నాలుగు స్తంభాలాట నడుస్తుంది.  వైసిపి లో  కొత్త పరిణమాలు వచ్చేలా ఉన్నాయి. ఉన్నట్లుండి ఒక కొత్త అభ్యర్థి పేరిపుడు ప్రచారం లోకి వచ్చింది. దీనికి కారణం, ఈ సారైనా నంద్యాల సీటును స్థానికుడికే ఇవ్వాలన్న డిమాండ్...

రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల వేడి..అంతకు మించిన ఉప ఎన్నికల వేడి నంద్యాల జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 

భూమా నాగిరెడ్డి మరణం వలన ఇక్కడ ఉప ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.ముందురోజుల్లో ప్రజాప్రతినిధులు మరణిస్తే వారి కుటుంబసభ్యులను ఎన్నికల్లో నిలబెట్టేవారు.ఇటీవల ఏకగ్రీవంగా వారి కుటుంబీకులకు ప్రజాప్రతినిధులను చేసే సంప్రదాయం(?) బయలుదేరింది.కానీ నంద్యాల విషయంలో ఈ సంప్రదాయానికీ ఒక ధర్మసందేహం తెలెత్తింది..కారణం పార్టీ ఫిరాయింపు..అందువల్ల పోటీ అనివార్యమైంది...కొన్ని నెలల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లోగా ఖాళీగా ఉన్న అన్ని స్థానాలకూ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మే నెలలో ఇక్కడా ఉప ఎన్నికలు జరగబోతాయని స్థానిక నేతలు ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు.

 

ప్రస్తుత నంద్యాల రాజకీయం ఇలా ఉంది...

 

తెలుగుదేశం.

మొన్నటి 2014 ఎన్నికల్లో వైకాపా తరపున నాగిరెడ్డి,తెదేపా తరపున శిల్పా మోహన్ రెడ్డి తలబబడ్డారు.నాగిరెడ్డి పార్టీ మారి తెదేపాలోకి వచ్చినా ఇరువర్గాలకు సయోధ్య ఉండేది కాదు.ఈలోగా శాసనమండలి ఎన్నికలు రావడం తెదేపా తరపున మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి నిలబడడం,సయోధ్య కుదిరిన సమయంలో నాగిరెడ్డి మరణించాడు.

 

 

ఇక కుటుంబ సభ్యులనే సంప్రదాయం ప్రకారం నాగిరెడ్డి అన్న శేఖర్ రెడ్డి(ఒకప్పటి ఆళ్లగడ్డ శాసనసభ్యుడు,వీరి అకాలమరణం తర్వాత నాగిరెడ్డి వచ్చాడు)కుమారుడు బ్రహ్మానంద రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.2009 లో బనగానపల్లె నుంచి ప్రజారాయం తరపున గెలిచి 2014 లో వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన కాటసాని రామిరెడ్డికి ఈ బ్రహ్మానందరెడ్డికి స్వయానా మామ.

 

ఈలోగా నంద్యాలకు 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ఫరూక్ తన మద్దతుదారులతో సమావేశమై భూమా కుటుంబీకులకు మద్దతు ఇస్తాము కానీ శిల్పా అయితే ఇవ్వమని తేల్చి చెప్పిన విషయం స్థానిక పత్రికల్లో వచ్చింది.

 

ఆ మరుసటిరోజే శిల్పా తన అనుచరులతో సమావేశమై తమకు టికెట్ రాకపోతే వైకాపా లో చేరాలా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా అని చర్చించి మరో సమావేశం జరుపుకోవాలనుకున్నారని పత్రికల వార్త.

 

 

మొన్నామధ్య నందికొట్కూరు తెదేపా నాయకుడు మాండ్ర శివానందరెడ్డి పార్టీ విషయాలు పత్రికలకు చెప్పడంటూ జిల్లా అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి షోకాజ్ నోటీస్ ఇచ్చాడు,మరి వారి అన్న పార్టీపట్ల అవిధేయత చూపుతుంటే నోటీస్ ఇవ్వారా అని శిల్పా ప్రత్యథి వర్గం ప్రశ్నిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే యం.పి యస్పీవై.రెడ్డి వర్గం కూడా మాకే టికెట్ కావాలంటూ అడుగుతున్నారు.వారి అల్లుడు శ్రీధర్ రెడ్డి పోటీలో నిలవాలని ఉన్నారు.

 

ఈ విధంగా భూమా,శిల్ప,ఫరూక్,యస్పీవై రెడ్డి వర్గాల మధ్య తెదేపాలో నాలుగు స్తంభాలాట నడుస్తుంది.

 

ఇక వైకాపా...

 

నాగిరెడ్డి పార్టీ ఫిరాయించిన తర్వాత పార్టీ బాధ్యతలు యస్పీవై.రెడ్డి మేనల్లుడు రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు.పార్టీ నిర్వహించిన గడపగడపకు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ వార్డ్ లో అభ్యర్థులను నిలిపి నాగిరెడ్డికి కేడర్ ను సమకూర్చాడు.

 

అయితే నాగిరెడ్డి మరణానికి కొద్దిరోజుల ముందు ఆళ్లగడ్డ లో గంగుల ప్రభాకర్ రెడ్డి శాసనమండలి సభ్యుడు కావడం(అప్పటికే వారి అబ్బాయి అక్కడి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు)ఆళ్లగడ్డలో వైకాపా కు ఊపిరిపోసింది..ఇదే అదనుగా నంద్యాల అభ్యర్థిగా వారి సోదరుడు మాజీ శాసనసభ్యుడు,పార్లమెంట్ సభ్యుడైన గంగుల ప్రతాప్ రెడ్డి పేరు నంద్యాల అభ్యర్థిగా వచ్చింది..దీనికి కారణం ఒకప్పటి ఆళ్లగడ్డలోని గోసుపాడు మండలం నంద్యాలలో చేరడం,అక్కడ వీరికి పట్టుండటం,నంద్యాల పరిసర గ్రామాల్లో బంధుత్వాలుండటం ఒక కారణం.

 

అయితే అనూహ్యంగా మరో పేరు జనం నుంచి వచ్చింది..ఆయన పేరూ ప్రతాప్ రెడ్డి,నంద్యాలలోని ప్రతాప్,రామనాధ్ గ్రూప్ థియేటర్స్ యజమాని.

 

ఈ ప్రతాప్ రెడ్డి తండ్రి  రామనాధ్ రెడ్డి 1989 ఎన్నికల్లో ఫరూక్ ను ఓడించారు..ఆ తర్వాత 1999 మునిసిపల్ ఎన్నికల్లో చైర్మెన్ గా ఈ ప్రతాప్ పేరు వినిపించినా ఆసక్తి చూపలేదు...అంతకుముందు స్వతంత్ర అభ్యర్థిగా నంద్యాల,గిద్దలూరుల్లో పోటీ చేసి ఓడిపోయిన యస్పీవై.రెడ్డిని అప్పటి నంద్యాల కాంగ్రెస్ పెద్దదిక్కు మాజీ యం.ఎల్.ఏ,య.పి దివంగత బొజ్జా వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చారు.

 

ఈ ఎన్నికల గురించి ఒక చిన్న ముచ్చట..అప్పటి అధికార పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యులు,ఒక మంత్రి నంద్యాల్లో ఏజంట్లుగా కూర్చున్నా అక్కడ వారు మద్దతు ఇచ్చినా వారిని జనం ఓడించారు...కారణం నంద్యాల ప్రజలు ఏ రోజూ గొడవ,దౌర్జన్య పరులను ఇష్టపడక పోవడం...ఇక్కడ రాజకీయ కత్తిపోట్లు,బాబు దాడులు ఇంతవరకూ జరగలేదు.

 

ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లో ఈ ప్రతాప్ పేరు వినిపించినా ఈసారి ప్రజలు,పార్టీ నుంచీ వత్తిడి ఎక్కువైంది...ఎన్నికల మీద విముఖతకు కారణం ఎన్నిక ఖర్చు 10-15 కోట్లకు చేరడం...ఏ హైదరాబాద్ లోనో రియల్ ఎస్టేట్ మరో వ్యాపారాలో చేసినవారికి సాధ్యం కానీ సంప్రదాయ వ్యాపార కుటుంబాలు విచ్చలవిడిగా ఖర్చు చేయలేకపోవటం....అప్పోసప్పో చేసిన వారికి ప్రస్తుత తరుణం లో అమ్ముడుపోవడమే శరణ్యం కావడం తెలిసిందే!నాకు ప్రజల సొమ్ము తినే ఆలోచన లేనప్పుడు ఎందుకు ఖర్చుపెట్టాలి ఈ ధనస్వామ్యంలో అని ఈయన ఉద్దేశం.

 

కానీ ప్రజల్లో స్థానికుడు రావాలనే అభిలాష ఉంది..స్థానికత చూసుకుంటే ప్రతాప్,ఫరూక్ ఇద్దరే స్థానికులు.

 

ఇక ఫరూక్ కూడా మొన్న శాసనమండలి సభ్యత్వం,మైనారిటీ కోటా కింద మంత్రి పదవి ఆశించినా దక్కలేదు....జగన్ తో మంతనాలు జరిగాయని కర్ణపిశాచి కథనం.

 

ప్రతాప్ అభ్యర్థిత్వం చూసుకుంటే వీరి తండ్రిగారికి,మామగారైన బొజ్జా వెంకటరెడ్డికి నంద్యాల మెజారిటీ ఓటర్లైన వైశ్య,ముస్లిం ఓటర్ల మద్దతు ఉంది..ఇక చిరంజీవి అభిమానులకు ఆయన మెజారిటీ సినిమాలు ఆడించిన ప్రతాప్ అంటే ప్రత్యేక అభిమానం...వివాద రహితుడు,సాత్వికుడన్న పేరుండటం కలిసొచ్చే అంశం....దగ్గరి బంధుత్వం ఉన్న గంగుల కుటుంబీకులు గోసుపాడు మండలం చూసుకుంటారు...ఈసారి ఈయన మీద ప్రజల వత్తిడి ఎక్కువగా ఉంది...ఈ వారంలో తన నిర్ణయం చెప్పే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu