పవన్నే ప్రశ్నిస్తున్న నెటిజన్లు

First Published Jun 8, 2017, 10:59 AM IST
Highlights

ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు అద్భుత నిర్మాణాలను ఏకిపారేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా నిర్మాణల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి. మీడియాలో ఎక్కడ చూసిన ఈ విషయంపైనే చర్చ. ఇంతటి ప్రాధాన్యత కలిగిన అంశంపై పవన్ స్పందించకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

ప్రశ్నించటానికే పార్టీ పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏమైపోయారు? కొద్ది రోజులుగ పవన్ జాడా తెలీటం లేదు. ఎక్కడో ఉన్న కేంద్రాన్ని చీటికి మాటికి ట్విట్టర్లో ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న పవన్ కు తాజాగా అసెంబ్లీ, సచివాలయం వివాదాం కనబడలేదా? లేకపోతే వర్షానికి వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయంలోకి నీరు కారటం పెద్ద విషయం కాదునుకున్నారా?

వెలగపూడిలో అసెంబ్లీ, సచివాలయం నిర్మించటం రాష్ట్రానికి ప్రతిష్టాత్మకం. అత్యున్నతమైన సాంకేతిక నైపుణ్యంతో భవనాలు నిర్మించామని చంద్రబాబునాయుడు ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు. హైదరాబాద్ నుండి వెలగపూడికి అసెంబ్లీ, సచివాలయం వచ్చేయటం నిజంగా హర్షనీయమంటూ గతంలో పవన్ కూడా ప్రభుత్వాన్ని అభినందించారు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనాలు ఓ చిన్న వర్షానికే కారటంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు అద్భుత నిర్మాణాలను ఏకిపారేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా నిర్మాణల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి. మీడియాలో ఎక్కడ చూసిన ఈ విషయంపైనే చర్చ. ఇంతటి ప్రాధాన్యత కలిగిన అంశంపై పవన్ స్పందించకపోవటం ఆశ్చర్యంగా ఉంది. షూటింగ్ లో ఉన్నా ఎక్కడున్నా కనీసం ట్విట్టర్లో అయినా స్పందించ వచ్చుకదా అంటూ నెటిజన్లు పవన్నే నిలదీస్తున్నారు.

click me!