పవన్ సాయం కోరుతున్న నెల్లూరు విద్యార్థులు

Published : Mar 02, 2017, 07:45 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
పవన్ సాయం కోరుతున్న  నెల్లూరు విద్యార్థులు

సారాంశం

విక్రమ్ సింహపురి యూనివర్శిటీ విద్యార్థుల అవినీతి వ్యతిరేక పోరాటానికి పవన్ మద్దతు

జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్‌కల్యాణ్‌ను కలిసేందుకు నెల్లూరు విక్రమసింహపురి యూనివర్శిటీ విద్యార్థులు నేడు హైదరాబాద్ వస్తున్నారు. పాదయాత్రగా బయల్దేరి ఈ బృందం నిన్న రాత్రి విజయవాడకు చేరుకుంది. గురువారం నాడు హైదరాబాద్‌ చేరుకునేలా వారు పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే, ఎండల కారణంగా, దారిలో కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పాదయాత్ర ఆపివేసి వాహనంలో హైదరాబాద్‌చేరుకోవాలని ఆయన  విద్యార్థులను   కోరారు.

 

నెల్లూరు విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం ఈ మధ్య అవినీతి వార్తల కెక్కింది. అక్కడ జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా, విద్యార్ధుల సమస్యలను పరిష్కారంకోసం చాలా కాలంగా విద్యార్థులు ఆందోళన జరుపుతూ వస్తున్నారు.  చివర వారు,  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తమ సమస్యలు వివరించి పరిష్కారం కోసం తమకు మద్ధతు తెలపాలని కోరేందుకు  వారు పవన్ ను కలవానుకున్నారు.  


వీ.యస్.యూ విద్యార్ధులు చేపడుతున్న పాదయాత్రకు పవన్ కళ్యాణ్ అభిమానులందరు మద్దతు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ జిల్లా అద్యక్షులు పీ.టోనీబాబు తెలిపారు.
 వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పవన్ కళ్యాణ్ అభిమానులు మంగళవారం పూలమాలలు వేసారు. విద్యార్ధుల పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సంధర్భంగా టోనీబాబు మాట్లాడుతూ బుధవారం ప్రారంభమయ్యే ఈ యాత్రకు ప్రతి జిల్లలో అభిమానులు సంఘీభావం తెలుపుతారన్నారు..  పవన్ కళ్యాణ్ పై నమ్మకముంచి విద్యార్ధులు నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తుండటం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే  పవన్ పార్టీ కార్యాలయానికి విద్యార్ధుల పాదయాత్ర గురించి పూర్తి సమాచారం ఇచ్చామని చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?