
దొరబాబు జిందాబాద్... రేపో మాపో నినాదాలు వినపడతాయి. మెడలో మోయలేనంత పూలదండలేసుకుని ఆయన వూరేగవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ‘బ్రదర్, మీరు బాగా గెలిచారు, అందుకే మీకు టికెటిచ్చాను,’ అని అభినందిస్తారు.
దొరబాబు చిత్తూరు జిల్లానుంచి ఏకగ్రీవంగా గెలుపొందిన ఎమ్మెల్సి అభ్యర్థి.
ఆయన ఎన్నిక ఎలా జరిగిందో తెలిస్తే అభినందించకుండా ఉండటం కష్టం.
మంగళవారం నామినేషన్లు వేయడం మొదలయినప్పటినుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులంతా నిన్న ఉపసంహరించుకునే వరకు తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఇలా పని చేసి, టిడిపి నాయకుడు దొరబాబు ఒక్కరే పోటీలో మిగిలేలా చేశారు.
మన దొరబాబు ఒక్క రే బరిలో ఉండాలి. ఆయనొక్కరే తెలుగుదేశానికి, ఆంధ్రదేశానికి సేవచేయలి, అని పైనుంచి ఉత్తర్వులొచ్చాయట.
అంతే, తెలుగు తమ్ముళ్లు కలెక్టకర్ కార్యాలయం మీద మిడతల దండులా వాలిపోయారు.
చేతిలో సంచి ఉంటే చాలా అందులోనామినేషన్ పత్రాలుంటాయని అనుమానించారు.సంచులన్నీ లాక్కుపోయారు. అందులో ఉన్న కాగితాలవేయినా సరే,అవి నామినేషన్ ప్రతాలే అయివుంటాయని వాటిని చింపేశారు. ఇంతలో ఒక పెద్ద మనిషి కలెక్టారాఫీసు దగ్గిర తచ్చాడుతూ కనిపించారు. అతగాడు నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి దూరేందుకు చూస్తున్నాడని పసిగట్టారు. అంతే, చేసంచిని లాక్కున్నారు. అందులో ఉన్న పేపర్లు చించేవారు. ఏదో మిషన్ ఉంటే దానిని పగులగొట్టారు. ఆయన ఎంతమొత్తకున్నా వారు వినేస్థితిలో లేరు.ఆయన మొత్తుకున్నదేమిటో తెలుసా... “అన్నా, నేను నామినేషన్ వేయడానికి రాలేదు. నేను రేషన్ డీలర్లని, అది ఇ-పాస్ మిషన్. నాపేరు గౌరయ్. మావూ రు పీలేరు.”
కరీముల్లా అనే మరొకడి చేతిలో ఏవో కాగితాలుంటే,అమాంతం ఆయన మీద పడి కాగితాలు లాక్కుని చించేశారు. అందులో అతగాడి డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉందట. కలెక్టర్ ఏర్పాటు చేసిన ఎన్నికల విధలు మీటింగుకొచ్చిన వాడాయన.
మంగళవారం ఉదయం నామినేషన్ వేసేందుకు వచ్చిన పెద్ద మండ్యం ఎంపిపి ప్రసాద్ రెడ్డిని డిస్పీ సమక్షంలో ‘ఎక్కడికో’ (కిడ్నాప్ అనొచ్చా) తీసుకెళ్లారు, మాట్లాడదామని చెబుతూ. పోలీసు రక్షణతోనే నామినేషన్ వేసేందుకు వచ్చిన వెదురుకుప్పం జడ్ పి టిసి సభ్యుడు మాధవురావుని ఉతికి పడేశారు. నామినేషన్ పత్రాలను చింపి పడేశారు. ఈ దాడిలో పోలీసు వాహనం అద్దాలు కూడా పగిలిపోయాయి. అయినా సరే, అతగాడు పట్టువదల్లేదు. ఏవో ఒకసెట్ పేపర్లు సంపాయించి నామినేషన్ వేశారు. (అవి సరిగ్గా లవేనడం వేరే విషయం). పీలేరు నుంచి నామినేషన్ వేసేందుకు వచ్చిన భానుప్రకాశ్ అనే అభ్యర్థినుంచి పోలీసులు చూస్తుండగానే నామినేషన్ పత్రాలను లాక్కున్నారు.నా ప్రతాలను లాక్కున్నారని చెప్పేందుకు రిటర్నింగ్ అధికారిని కలవాలనుకుంటే ‘అభ్యర్థులు తప్ప మరొకరు ప్రవేశించడానికి వీల్లేదుపో’ అని లోపలికి అనుమతించలేదు. భాను ప్రకాశ్ డిగ్రీసర్టిఫికేట్ లను కూడా తెలుగు తమ్ముళ్లు చింపేశారట.
... ఇలా చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దొరబాబు ఒక్కరే ... మిగల్లేదు.
మరొక నలుగురు అభ్యర్థులు కూడా మిగిలారు. అయితే వారు బుధవారం నాడు ‘స్వచ్ఛందం’గా ఉపసంహరించుకున్నారు.
అందుకే రేపో మాపో పెద్ద మెరవని ఉంటుంది. స్వీట్లు పంచుతారు. టపాకాయలు కాలుస్తారు. దొరబాబు జిందాబాద్.