నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని ప్రకటించారు.
నెల్లూరు: వైసీపీ నాయకత్వం కొత్త డ్రామాలకు తెర తీసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. తన తమ్ముడికి వ్యతిరేకంగా పోటీ చేయబోనని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో తన మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. అనుమానం ఉన్నచోట మనుగడ సాగించడం కష్టమని ఆయన చెప్పారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల కాలంలో చేస్తున్న విమర్శులు కలకలం రేపుతున్నాయి. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినా శ్రీధర్ రెడ్డి మెండిచేయి దక్కింది. అయితే జిల్లా నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి కి జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో శ్రీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.. ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. సీఎం జగన్ ఆయనను పిలిపించి మాట్లాడారు.
undefined
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరుపై శ్రీధర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడంపై డ్రైనేజీలో నిలబడి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. టీడీపీ ప్రభుత్వ హయంలో డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడంతో తాను నిరసనకు దిగారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ సమస్య తీరలేదని శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు.
also read:కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఫోకస్.. చర్యలు తప్పవా..?
అధికారుల తీరుపై విమర్శలు చేస్తుండడంతో ఇటీవల సీఎం జగన్ శ్రీధర్ రెడ్డిని పిలిపించి మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి తీరులో మార్పు వస్తుందని భావించారు. తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని నిన్న వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వైసీపీ నాయకత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. పార్టీ నాయకత్వంతో తాడోపేడో తేల్చుకొనే ఉద్దేశ్యంతో శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కన్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.