వడదెబ్బతో జర్నలిస్టు మృతి

First Published May 23, 2017, 4:04 PM IST
Highlights

ఓ జర్నలిస్టు వడ దెబ్బతో మృతి చెందిన విషాదకర సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండటంతో జనాలు పట్టల్లా రాలిపోతున్నారు.

 

మధ్యాహ్నం వేళలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటుతోంది. దీంతో పనుంటే తప్పా జనాలు రోడ్డెక్కడం లేదు.

 

అయితే జర్నలిస్టుల పరిస్థితి వేరు. వార్తాసేకరణలో భాగంగా వారెప్పుడైనా ఏ సమయానికైనా కదలాల్సిందే. పగలు సూర్యుడితో రాత్రి చంద్రుడితో పోటీపడాల్సిందే.

 

అలా పోటీపడుతూనే ఓ జర్నలిస్టు వడ దెబ్బతో మృతి చెందిన విషాదకర సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 

కలువాయి మండలం దాసూరు ముక్కుతిమ్మపాలెంకు చెందిన పెంచలప్రసాద్ ఆంధ్రజ్యోతిలో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు.   

 

నెల్లూరు జిల్లా జెడ్పీ డేట్ లైన్ కింద వార్తలురాస్తుంటారు. వడదెబ్బకు గురికావడంతో ఈరోజు ఆయన మృతిచెందారు.

click me!