నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు.. డిప్యూటీ మేయర్ అనుచరుడిపై దాడి.. ఎమ్మెల్యే అనిల్‌ అనుచరులపై ఆరోపణలు..!!

Published : May 20, 2023, 12:09 PM ISTUpdated : May 20, 2023, 12:11 PM IST
నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు.. డిప్యూటీ మేయర్ అనుచరుడిపై దాడి.. ఎమ్మెల్యే అనిల్‌ అనుచరులపై ఆరోపణలు..!!

సారాంశం

నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ముఖ్య అనుచరుడు, ముస్లిం మైనార్టీ నేత అబ్దుల్ హాజీపై గత రాత్రి దాడి జరిగింది. అయితే మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులే దాడి చేశారని రూప్ కుమార్ వర్గం ఆరోపిస్తుంది. 

నెల్లూరు వైసీపీలో వర్గ  విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ముఖ్య అనుచరుడు, ముస్లిం మైనార్టీ నేత అబ్దుల్ హాజీపై గత రాత్రి దాడి జరిగింది. అయితే మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులే దాడి చేశారని రూప్ కుమార్ వర్గం ఆరోపిస్తుంది. రూప్ కుమార్‌తో తిరుగుతున్నందునే తనపై అటాక్ చేశారని హాజీ ఆరోపించారు. ఇక, రూపకుమార్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న హాజీని పరామర్శించారు. వైసీపీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడిన మైనార్టీ నేత హాజీపై హత్యాయత్నం చేయడం దారుణమన్నారు. 

తనపై కక్షతోనే తన మనుషులపై దాడి చేశారని రూప్ కుమార్ ఆరోపించారు. అనిల్ కుమార్ యాదవ్ ఆయన మనుషులను అదుపులో పెట్టుకోవాలని అన్నారు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని చెప్పారు. నెల్లూరులో జరుగుతున్న పరిణామాలను వైసీపీ అధిష్టానం, సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని  చెప్పారు. నెల్లూరు నగరంలో అనిల్ పార్టీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు స్పందించాలని కోరారు. ఇక, అనిల్ కుమార్‌ యాదవ్‌కు రూప్ కుమార్ బంధువు అన్న సంగతి తెలిసిందే. 

Also Read: సీఎం జగన్ దంపతుల ఆశీస్సులతో.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే రాపాక కుమారుడి పెళ్లి పత్రిక..!

ఇదిలా ఉంటే, ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. తన పేరుతో తప్పుడు వార్తలతో ప్రచారం చేసినంత మాత్రాన ఈ ఫేక్ గాళ్లకు ఒరిగేదేం లేదన్నారు. తన పేరును వాడుకుని డబ్బులు సంపాదించుకుంటూ, సుఖంగా ఉన్నారంటే దానిని కూడా స్వాగతిస్తానన్నారు. తన తండ్రి సాక్షిగా రాజకీయాల్లో కొనసాగినంత కాలం జగనన్నతోనే తన ప్రయాణం అని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 

Also Read: విశాఖలో దారుణం.. బీచ్‌లో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు..!!

జగన్ తనను తరిమేసే పరిస్ధితి ఎన్నటికీ రాదన్న ఆయన.. ఒకవేళ అదే జరిగినా చివరి శ్వాస వరకు జగన్‌ కోసమే పనిచేస్తానని తేల్చేశారు. పేరున్న గొర్రెల్లో ఒక గొర్రెగా ఉండే కంటే.. ఒంటరిగా సింహంలా ఉండటమే మంచిదంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. మోకాలి సమస్య కారణంగా తాను గత కొన్ని రోజులుగా నియోజకవర్గానికి దూరంగా వుంటున్నానని.. దయచేసి దీనిపై తప్పుడు వార్తలు రాయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. చికిత్స పూర్తి చేసుకుని కోలుకున్న వెంటనే తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంటానని అనిల్ కుమార్ యాదవ్ స్పస్టం చేశారు. గెటవుట్.. గెట్ లాస్ట్ అని జగన్ అన్నా.. తాను మాత్రం ఫాలోవర్‌గానే వుంటానని అనిల్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu