నెల్లూరు కోర్టు చోరీ కేసు: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ

By narsimha lode  |  First Published Jan 6, 2023, 5:17 PM IST

నెల్లూరు కోర్టు చోరీ కేసు అంశంపై  సీబీఐ  అధికారులు  శుక్రవారం నాడు  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ప్రశ్నించారు. 
 



నెల్లూరు:  నెల్లూరు కోర్టు చోరీ కేసు అంశంపై సీబీఐ అధికారులు  శుక్రవారంనాడు మాజీ మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డిని  ప్రశ్నించారు.  చెన్నై నుండి వచ్చిన సీబీఐ అధికారులు  సోమిరెడ్డిని విచారించారు.నెల్లూరు కోర్టులో 2022 ఏప్రిల్  14న  నెల్లూరు కోర్టు ఆవరణలోని  4వ అదనపు  కోర్టులో  చోరీ జరిగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  దాఖలు చేసిన కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు చోరీకి గురయ్యాయి. 

కోర్టులో  ఆధారాలను  దొంగలు చోరీ చేశారు.  చోరీకి పాల్పడిన  నిందితులను ఏప్రిల్  17న అరెస్ట్  చేశారు. సయ్యద్ హయత్ , ఖాజా రసూల్ ను అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ  విజయరావు తెలిపారు.కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీ కోసం  వచ్చిన నిందితులు కుక్కలు వెంబడించడంతో కోర్టు ఆవరణలోకి వెళ్లినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ ఘటనను  సుమోటోగా తీసుకొని  ఏపీ హైకోర్టు విచారించింది. చివరకు  ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ  గత ఏడాది నవంబర్  24  ఏపీ హైకోర్టు  ఆదేశించింది.. దీంతో  సీబీఐ అధికారులు  ఈ కేసును విచారిస్తున్నారు.  ఇవాళ  చెన్నై నుండి  వచ్చిన  సీబీఐ ఎస్పీ స్థాయి అధికారి  మాజీ మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డిని విచారించారు. సుమారు  గంటకు పైగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు.  

Latest Videos

undefined

మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని కాకాని గోవర్ధన్ రెడ్డి  ఆరోపించారు. పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గోవర్ధన్ రెడ్డి  చెప్పారు. మీడియా సమావేశం ఏర్పాటు  చేసి కొన్ని పత్రాలను కూడ  కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేశారు. ఈ పత్రాలు నకిలీవని  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  కాకాని గోవర్ధన్ రెడ్డిపై  పోలీసులకు ఫిర్యాదు  చేశారు.ఈ విషయమై పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు  చేశారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. 

also read:నెల్లూరు కోర్టులో చోరీపై సీబీఐ విచారణను స్వాగతిస్తున్నా: ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు. కోర్టులో భదర్రపచ్చిన ఆధారాలు చోరీకి గురయ్యాయి.  
 

click me!