ఏపీ బీజేపీలో కలకలం: కన్నా లక్ష్మీనారాయణపై అధిష్టానానికి సోము ఫిర్యాదు

By narsimha lodeFirst Published Jan 6, 2023, 4:46 PM IST
Highlights

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై  సోము వీర్రాజు  వర్గం  పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు  చేసింది.   ఇటీవల  కాలంలో  పార్టీపై  కన్నా లక్ష్మీనారాయణ చేసిన  విమర్శలను ఆ ఫిర్యాదులో   ప్రస్తావించింది. 

గుంటూరు:బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు   ఇటీవల కాలంలో  కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై  పార్టీ అధిష్టానానికి  ఫిర్యాదు  చేసినట్టుగా  ప్రచారం సాగుతుంది. .  బీజేపీని వీడాలనే యోచనలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ  పార్టీపై  విమర్శలు  చేస్తున్నారని  సోము వీర్రాజు వర్గం  ఆరోపణలు చేస్తుంది.  ఈ ఆరోపణలను కన్నా లక్ష్మీనారాయణ వర్గం తోసిపుచ్చుతుంది. గత ఏడాది చివర్లో   గుంటూరులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగానే  ఈ భేటీ జరిగినట్టుగా  నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ భేటీ తర్వాత   జనసేనలో  కన్నా లక్ష్మీనారాయణ చేరే అవకాశం ఉందని  ప్రచారం జోరందుకుంది..ఈ ప్రచారాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఖండిస్తున్నారు.  

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  కన్నా లక్ష్మీనారాయణ  ఉన్న సమయంలో  నియమించిన  ఆరు జిల్లాలకు చెందిన  అధ్యక్షులను  సోము వీర్రాజు తప్పించారు . అయితే వీరిని  రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోవడంతో నే  ఆరుగురు జిల్లాల అధ్యక్షులను  తప్పించినట్టుగా   సోము వీర్రాజు  వర్గం చెబుతుంది.  ఆరు జిల్లాల అధ్యక్షులను తొలగించడంతో  కన్నా లక్ష్మీనారాయణ వర్గానికి చెందిన  మరికొందరు కూడా  పార్టీ పదవులకు  రాజీనామాలు సమర్పించారు.  

సోము వీర్రాజు  వ్యవహరిస్తున్న తీరుపై  కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే  విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితికి  సోము వీర్రాజే కారణమని కూడా కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.  జనసేనకు, బీజేపీ  మధ్య గ్యాప్ ఏర్పడడానికి  సోము వీర్రాజు వైఖరే కారణమని    కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో  పార్టీ బలోపేతం  కాకపోవడానికి  సోము వీర్రాజు  వైఖరే కారణమని  ఆయన  ఆరోపించారు.  ఈ విషయమై ఇటీవల కాలంలో కన్నా లక్ష్మీనారాయణ  తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలను  సోము వీర్రాజు  పార్టీ జాతీయ నాయకత్వానికి  పంపింది.  

also read:ఏపీ బీజేపీలో కలకలం : సోము వీర్రాజుపై ధిక్కార స్వరం .. పలు చోట్ల నేతల రాజీనామాలు

 కన్నా లక్ష్మీనారాయణ  బీజేపీని వీడడానికి రంగం సిద్దం చేసుకొనే ్క్రమంలోనే  విమర్శలు చేస్తున్నారని  సోము వీర్రాజు వర్గం భావిస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగా  విమర్శలు చేసినా కూడా  సోము వీర్రాజు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాష్ట్రంలో చోటు  చేసుకున్న ప రిణామాలన్నీ కూడా పార్టీ అధిష్టానానికి తెలుసునని  వీర్రాజు  వర్గం చెబుతుంది.
 

click me!