ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబుపై సజ్జల ఫైర్

Published : Jan 06, 2023, 03:11 PM IST
ఉన్మాదిలా  ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబుపై  సజ్జల ఫైర్

సారాంశం

చంద్రబాబు కుప్పంలో వ్యవహరిస్తున్న తీరును  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు.  

హైదరాబాద్:టీడీపీ చీఫ్ చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  విమర్శించారు.  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది కల్గించేలా  రోడ్లపై సభలు  నిర్వహించడం సరైంది కాదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి,ప్రజలకు రక్షణ కల్పిచడం  ప్రభుత్వ బాధ్యతగా ఆయన చెప్పారు. పోలీస్ యాక్ట్ కు లోబడే ప్రభుత్వం జీవో  నెంబర్  1ని అమల్లోకి తెచ్చిందని  ఆయన  చెప్పారు. అన్ని పార్టీలకు ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు.

తమ పార్టీ కూడా  ఈ జీవోకి కట్టుబడి ఉండాల్సిందేనని  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు. జీవో నెంబర్  1ని ఉల్లంఘిస్తామని  టీడీపీ ఛాలెంజ్ చేస్తుందని   సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.  చట్టాన్ని ఉల్లంఘించడం  సబబు కాదన్నారు. దండయాత్రలా చంద్రబాబునాయుడు కుప్పానికి బయలుదేరినట్టుగా  ఆయ న  చెప్పారు. కందుకూరు, గుంటూరులలో అమాయకుల ప్రాణాలు బలికావడానికి  చంద్రబాబే కారణమని  సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నిబంధనలు పాటించి ఉంటే  అమాయకులు బలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబుకు కనీస సంస్కారం లేదన్నారు.  ఈ పరిస్థితి ఎందుకు  వచ్చిందో  చంద్రబాబు ఆలోచించాలని  సజ్జల రామకృష్ణారెడ్డి  సూచించారు. కుప్పంో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని  ఆయన విమర్శించారు. చంద్రబాబు తీరును  ప్రజలు గమనించాలని ఆయన కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే