నెల్లూరులోని వెంకటాచలం మండలం నక్కలగుట్ట వద్ద యాసిడ్ దాడికి గురైన 9వ తరగతి విద్యార్ధినిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు: జిల్లాలోని వెంకటాచలం నక్కలగుట్ట వద్ద యాసిడ్ దాడికి గురైన 9వ తరగతి విద్యార్ధినిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.సోమవారం నాడు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు అనే నిందితుడు బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. బాలికపై అత్యాచాయత్నం చేశాడు. బాలిక ప్రతిఘటించింది. దీంతో బాలికపై నిందితుడు యాసిడ్ దాడికి దిగాడు. అంతేకాదు బాలిక గొంతు కోసి పారిపోయాడు.
also read:నెల్లూరులో మైనర్ బాలికపై యాసిడ్ దాడి: పోలీసుల అదుపులో నిందితుడు, బాలిక పరిస్థితి విషమం
undefined
బాలిక కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే బాలిక తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో ఉండడాన్ని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సోమవారం నాడు రాత్రి నుండి బాలికకు చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి బాలికను తరలించారు. బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలో కూడ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో యాసిడ్ దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని చార్వా ప్రాంతంలో బ్యాంకు మేనేజర్ పై యాసిడ్ దాడి జరిగింది.ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలో ప్రియురాలి భర్తపై ప్రియుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఈ ఏడాది జూలై 14న చోటు చేసుకుంది.పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై కర్ణాటక రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 11న యాసిడ్ దాడి జరిగింది.గుజరాత్ రాష్ట్రంలో స్నేహం చేయడానికి ఒప్పుకోలేదని యువతిపై యాసిడ్ దాడికి దిగాడు ఈ ఘటన ఈ ఏడాది మార్చి మాసంలో జరిగింది. ప్రతి రోజూ ఆటోలో వెళ్లే సమయంలో పరిచయమైన ఆటో డ్రైవర్ తనతో స్నేహం చేయాలని కోరడంతో యువతి తిరస్కరించింది. దీంతో ఆమె.పై నిందితుడు యాసిడ్ దాడికి దిగాడు.