కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో పలువురు విద్యార్ధులకు అస్వస్థత: ఆసుపత్రిలో చేరిక

By narsimha lodeFirst Published Sep 6, 2022, 12:11 PM IST
Highlights

కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్ధులు అస్వస్థతకు గురికావడానికి కారణాలు తెలియాల్సి ఉంది.  

కాకినాడ: కాకినాడ జిల్లా వలసపాక కేంద్రీయ విద్యాలయంలో మంగళశారం నాడు పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడకపోవడంతో పాటు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులకు చికిత్స అందిస్తున్నారు.

ఇవాళ ఫస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత  రెండో పీరియడ్ జరిగే సమయంలో  కళ్లు తిరుగుతున్నాయని కొందరు, ఊపిరి ఆడడం లేదని మరికొందరు చెప్పడంతో స్కూల్ ఆవరణలో కూర్చొబెట్టినట్టుగా టీచర్లు తెలిపారు.  అస్వస్థతకు గురైన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు. తమ ఆరోగ్యం బాగా లేదని చెప్పిన విద్యార్ధుల పేరేంట్స్ కు సమాచారం ఇచ్చారు టీచర్లు. అయితే విద్యార్ధులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

ఇదిలా ఉంటే నిన్న టీచర్స్ డే సందర్భంగా తిన్న కేక్ కారణంగానే ఇలా జరిగిందని కొందరు విద్యార్ధులు చెబుతున్నారన్నారు. మరో వైపు స్కూల్ కు సమీపంలో ఏమైనా విష వాయువులు పీల్చడం కారణమా అనే విషయమై చర్చ జరుగుతుంది. అయితే ఎలాంటి విష వాయువులు వెలువడలేదని టీచర్లు చెబుతున్నారు.ఐదో తరగతి, ఆరో తరగతి విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని స్కూల్ సిబ్బంది తెలిపారు. 

అస్వస్థతకు గురైన విద్యార్ధులకు చికిత్స అందిస్తున్నారు. అయితే అసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని సమాచారం.   కాకినాడలోని జీజీహెచ్  ఆసుపత్రిలో సుమారు 40 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.  తమకు కెమికల్ వాయువు  వాసన వచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురైనట్టుగా కొందరు విద్యార్ధులు చెబుతున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

ఐదు, ఆరో తరగతి విద్యార్ధులే అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ రెండు క్లాసుల విద్యార్ధులు చదువుకున్న విద్యార్ధులు తరగతి గదుల్లో ఏమైనా జరిగిందా అనే విషయమై  దర్యాప్తు చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విష వాయువులు అయితే స్కూల్ లోని అన్ని తరగతుల విద్యార్ధులు కూడా అస్వస్థతకు గురయ్యేవారు కదా అని కూడా కొందరు  విద్యార్ధుల పేరేంట్స్ ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను  తెలుసుకొని దాన్ని పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 
 

click me!