కిమ్స్ కార్డియాలజిస్టుకు జాతీయ స్థాయి గుర్తింపు.. అరుదైన శస్త్ర చికిత్సకు గౌరవంగా

Published : Mar 28, 2026, 03:07 PM IST
NDIA LIVE 2026

సారాంశం

NDIA LIVE 2026: విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉన్న కిమ్స్ హాస్పిటల్‌లో చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ గణేష్ కాసినాధునికు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇండియా లైవ్ 2026 సదస్సులో అవార్డును ప్రదానం చేశారు. 

కిమ్స్ హాస్పిటల్‌లో చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ గణేష్ కాసినాధునికు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే INDIA LIVE 2026 సదస్సులో ఆయనకు “Top 5 బెస్ట్ కేసెస్ అప్రిచియేషన్ అవార్డ్” ప్రదానం చేశారు.

ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ప్రముఖ కార్డియాలజిస్టులు పాల్గొన్నారు. వివిధ ఆసుపత్రుల నుంచి 1,000కు పైగా క్లిష్టమైన గుండె సంబంధిత కేసులు పంపించగా, అందులో నుంచి సుమారు 250 కేసులు మాత్రమే ఓరల్ ప్రెజెంటేషన్‌కు ఎంపికయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ గణేష్ కాసినాధుని కేసు ఎంపిక కావడం ప్రత్యేకతగా నిలిచింది.

క్లిష్టమైన గుండె కేసును విజయవంతంగా పరిష్కారం

డాక్టర్ గణేష్ కాసినాధుని జాతీయ ఫ్యాకల్టీ సభ్యుడిగానూ పాల్గొన్నారు. కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స చేసిన ఒక క్లిష్టమైన గుండె కేసును ఆయన సదస్సులో వివరించారు. ఈ కేసులో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కోరోనరీ ఆర్టరీల్లో తీవ్రమైన కాల్సిఫిక్ బ్లాకేజీలు ఉన్నాయి. ముఖ్యంగా లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ ప్రాంతంలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించడం చాలా సవాలుగా మారింది.

ఆధునిక సాంకేతికతతో చికిత్స

ఈ చికిత్సలో ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించారు. Rotablation, Intravascular Lithotripsy వంటి పద్ధతుల ద్వారా కాల్షియం గడ్డలను తొలగించి చికిత్స నిర్వహించారు. అలాగే Optical Coherence Tomography (OCT) అనే ఆధునిక ఇమేజింగ్ సాంకేతికత సహాయంతో స్టెంట్‌ను కచ్చితంగా అమర్చారు. దీంతో రోగికి మంచి ఫలితాలు లభించాయి.

టాప్ 5 ప్రెజెంటేషన్లలో స్థానం

డాక్టర్ గణేష్ కాసినాధుని ప్రెజెంటేషన్ క్లినికల్ వివరాలు, స్పష్టమైన వివరణ, విద్యాపరమైన విలువల కారణంగా అక్కడి వైద్య నిపుణులను ఆకట్టుకుంది. అందుకే ఈ కేసును టాప్ 5 ప్రెజెంటేషన్లలో ఒకటిగా ఎంపిక చేసి సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రత్యేకంగా సత్కరించారు.

ఈ గుర్తింపు ద్వారా కిమ్స్ హాస్పిటల్స్ ఆధునిక గుండె చికిత్సలో ముందంజలో ఉన్నాయని మరోసారి రుజువైంది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగంలో ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తూ రోగులకు ఉత్తమ వైద్యం అందిస్తున్నట్లు ఈ ఘనత స్పష్టం చేస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu