Apollo: విద్యార్థుల్లో సృజ‌నాత్మ‌క పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా.. అపోలో యూనివర్సిటీలో ప్ర‌త్యేక ఎగ్జిబిష‌న్

Published : Feb 19, 2026, 04:18 PM IST
Apollo

సారాంశం

Apollo: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులోని ది అపోలో యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఎగ్జిబిషన్ నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ వెల్లడించారు. 

శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు

విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత, పరిశోధనా ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల దశలోనే సైన్స్ పట్ల ఆసక్తి పెరిగితే భవిష్యత్‌లో మంచి శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు రూపుదిద్దుకుంటారని ఆయన పేర్కొన్నారు. యువ ప్రతిభలకు తమ ఆలోచనలను ప్రదర్శించుకునే అరుదైన అవకాశం ఇదని చెప్పారు.

వివిధ శాస్త్ర విభాగాల్లో ప్రాజెక్టులకు అవకాశం

ఈ ప్రదర్శనలో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, పర్యావరణ శాస్త్రం వంటి విభాగాల్లో ప్రాజెక్టులను ప్రదర్శించవచ్చు. విద్యార్థులు రోజువారీ జీవితంలో గణిత వినియోగం, పునరుత్పాదక శక్తి వనరులు, విద్యుత్ సాంకేతికత, రసాయనిక ప్రక్రియలు, ఆరోగ్యం, బయోటెక్నాలజీ, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై నమూనాలను రూపొందించి తీసుకురావచ్చు.

ఆకర్షణీయ నగదు బహుమతులు

ప్రతి విభాగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నారు.

ప్రథమ బహుమతి – రూ. 5,000

ద్వితీయ బహుమతి – రూ. 3,000

తృతీయ బహుమతి – రూ. 2,000

ఉత్తమ ప్రదర్శనలకు ప్రత్యేక ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వనున్నారు.

ఎలా రిజిస్ట‌ర్ చేసుకోవాలి

పాల్గొనాల‌నుకునే విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం 9959540302 నంబర్‌ను సంప్రదించవచ్చు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలకు కొత్త దారులు చూపనుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వైఎస్సార్ మరణం పై వివాదం అచ్చెన్నాయుడు vs బొత్స | YSR Controversy | TDP vs YCP | Asianet News Telugu
రాష్ట్రానికి రానున్న ప్రాజెక్ట్స్ ఇవే మంత్రి ప్రెస్ మీట్ | Minister Kolusu Parthasarathy Pressmeet