నిన్న పోలవరం, నేడు పురుషోత్తపట్నం: జగన్ సర్కార్ పై కేంద్రం ఆంక్షలు

By Nagaraju penumalaFirst Published Aug 13, 2019, 2:58 PM IST
Highlights

పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలను ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, పురుషోత్తపట్నం- చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఆ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలని సూచించింది. 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలను ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. 

గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, పురుషోత్తపట్నం- చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఆ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలని సూచించింది. 

ఇకపోతే రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలపై కేంద్రం నియమించిన జాయింట్ కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక అందజేసింది. నివేదిక ఆధారంగా ప్రాజెక్టులు ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

మరోవైపు అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారంటూ మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వట్టి వసంతకుమార్, శ్రీనాథ్ రెడ్డి ఫిటిషన్లు వేశారు. ఈ ఫిటిషన్‌పై స్పందించిన ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

ఇకపోతే ఈనెల 7న పోలవరం ప్రాజెక్టుపై కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షలు విధించింది. పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 

పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘినట్లు కేంద్రం స్పష్టం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది.  పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా కేంద్రం వివరణ కోరింది. 

ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించారంటూ చెన్నై పర్యావరణ శాఖ అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించారు. దాంతో పోలవరం, దాని అనుబంధ ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తనిఖీలు నిర్వహించింది.
 

ఈ వార్తలు కూడా చదవండి

పోలవరంపై జగన్ సర్కార్ కి కేంద్రం షోకాజ్

click me!