తన పేరుతో నకిలీ ట్వీట్ ను సృష్టించి ప్రచారం చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సీఐడీకి మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.
అమరావతి: ఏపీ భారీ నీటి పాదరుల శాఖ మంత్రి Ambati Rambabu,పై మాజీ మంత్రి Devineni Uma Maheswara rao CID కి మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. Twitter ఖాతాను మార్పింగ్ చేసి తప్పుడు ప్రచారం చేశారని మంత్రి అంబటి రాంబాబుపై దేవినేని ఉమా మహేశ్వరరావు పిర్యాదు చేశారు. Morphingచేసిన ట్వీట్ ను తనకు ట్యాగ్ చేసి అంబటి రాంబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పిర్యాదులో దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.. ఈ ఫేక్ ట్వీట్ల వెనుక ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని ఆయన ఆరోపించారు.
ఫేక్ ట్వీట్ తో కులాలు, పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు పలువురు టీడీపీ నేతల పేరుతో పేక్ ట్వీట్లు వైరల్ గా మారాయి. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, TDP పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల పేరుతో కూడా ట్వీట్లు వైరలయ్యాయి. తన పేరుతో నకిలీ ట్వీట్లు వైరలయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు.
పోలవరం పై సవాల్ కు సమాధానం చెప్పలేక ఫేక్ ట్వీట్ ను ట్వీట్ చేసాడంటే మంత్రిగా మీ పరిజ్ఞానం ఏంటో తెలిసిందా? దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? https://t.co/fM9ZKO1GjV
— Devineni Uma (@DevineniUma)ఈ నకిలీ ట్వీట్ ను తనతో పాటు ప్రచారం చేసిన మంత్రి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమామడ్ చేశారు దేవినేని ఉమా మహేశ్వరరావు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తాను ట్వీట్ చేసినట్టుగా ఫేక్ ట్వీట్ ను ప్రచారం చేశారని దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. ఫేక్ ట్వీట్ల విషయంలో కుట్ర కోణం ఉందన్నారు. మంత్రి అంబటి రాంబాబు తాను ట్వీట్ చేసినట్టుగా ప్రచాారం చేసిన ట్వీట్ ఫేక్ అని దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.