మా నాన్నను కొట్టి చిత్రహింసలు పెట్టారు: మోడీ, ఓంబిర్లాకు ఎంపీ రఘురామకృష్ణంరాజు కొడుకు భరత్ లేఖలు

By narsimha lode  |  First Published May 16, 2021, 11:44 AM IST

చట్ట విరుద్దంగా తన తండ్రిని ఏపీ సీఐడీ పోలీసులు  అదుపులోకి తీసుకొన్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లాకు లేఖలు రాశారు.


అమరావతి: చట్ట విరుద్దంగా తన తండ్రిని ఏపీ సీఐడీ పోలీసులు  అదుపులోకి తీసుకొన్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లాకు లేఖలు రాశారు.ఈ నెల 14వ తేదీన సాయంత్రం హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉన్న సమయంలో  ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన ఆ లేఖలో చెప్పారు. అరెస్ట్ సమయంలో సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరును భరత్ ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంటి నుండి రఘురామకృష్ణంరాజును తీసుకెళ్లి కారులో ఎత్తివేశారని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. అరెస్టైన ఎంపీ రఘురామకృష్ణంరాజును గౌరవంగా చూసుకొంటున్నామని  ఏపీ రాష్ట్ర అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పిన విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. మంచి ఆహారాన్ని కూడ అందిస్తున్నామన్నారు. 

also read:రఘురామకృష్ణంరాజు కేసు: మొబైల్ ఫోనే కీలకం, వాట్సాప్ చాటింగ్‌పై సీఐడీ ఫోకస్

Latest Videos

undefined

ఈ నెల 14వ తేదీన విచారణ సమయంలో తన తండ్రిని  తీవ్రంగా హింసించారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు తన తండ్రిని తీవ్రంగా కొట్టారన్నారు. తన తండ్రి కాళ్లపై విపరీతంగా కొట్టడం వల్ల కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.  కాళ్లు, పాదాలు, శరీరంపై  పోలీసులు కొట్టిన గాయాలు కన్పిస్తున్నాయని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.

ఈ నెల 14న  అరెస్ట్ చేసే సమయంలో ఇద్దరు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన తండ్రిని కొట్టి కారులో ఎత్తేశారని ఆయన ఆ లేఖలో  ఫిర్యాదు చేశారు. తన రాజకీయ ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని కొందరు  మీడియాలోనే బెదిరింపులకు దిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  లేకపోతే చచ్చేవరకు కొడుతామని బెదిరించారని ఆ లేఖలో ఆయన తెలిపారు.  సరైన ఆహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. అంతేకాదు  టాయిలెట్లు కూడ వాడనివ్వని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 

తన తండ్రికి నాలుగు మాసాల క్రితం గుండె ఆపరేషన్ అయిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వారం రోజులక్రితమే ఆయన కరోనా నుండి కోలుకొన్న విషయాన్ని భరత్ ఆ లేఖలో గుర్తు చేశారు.  ఈ నెల 14వ తేదీన పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో తన తండ్రిని తీవ్రంగా కొట్టారని, తీవ్రంగా దూషించారని ఆయన చెప్పారు. శారీరకంగా కొట్టడం ద్వారా ఎంపీని చంపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై గుంటూరులో న్యాయమూర్తికి ఈ విషయమై లిఖితపూర్వకంగా తన తండ్రి ఫిర్యాదు చేశారని ఆ లేఖలో తెలిపారు. 


 

click me!