మెరుగైన చికిత్స కోసం:న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన రఘురామకృష్ణంరాజు

By narsimha lodeFirst Published May 26, 2021, 3:51 PM IST
Highlights

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం నాడు మధ్యాహ్నం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.  ఇవాళ ఉదయమే ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. 

న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం నాడు మధ్యాహ్నం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.  ఇవాళ ఉదయమే ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ ఉదయం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆర్మీ ఆసుపత్రి నుండి డిశార్జ్ కాగానే బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో  ఢిల్లీకి చేరుకొన్నారు. ఢిల్లీకి చేరుకొన్న వెంటనే ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ లో చేరారని తెలుస్తోంది.

also read:ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఢిల్లీకి రఘురామ కృష్ణం రాజు

ఈ నెల 14వ తేదీన ఏపీ సీఐడీ పోలీసులు హైద్రాబాద్ లోని ఇంట్లో ఉన్న రఘురామకృష్ణంరాజును  అరెస్ట్ చేశారు.  రాష్ట్ర ప్రతిష్టకు భంగం కల్గించారనే  ఆరోపణలపై  సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ విషయమై సుప్రీంకోర్టును రఘురామకృష్ణంరాజు ఆశ్రయించారు. దీంతో  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

సీఐడీ పోలీస్ కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణంరాజు  విజయవాడ కోర్టుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఈ రిపోర్టును కోర్టుకు ఆర్మీ వైద్యులు సమర్పించారు. 

click me!