ఆ అధికారుల జాబితా సిద్దం... భవిష్యత్ లో భారీ సత్కారం: కర్నూల్ టిడిపి చీఫ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published May 26, 2021, 2:50 PM IST
Highlights

అక్రమ కేసులు బనాయించి తమ పార్టీ నాయకుడు జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేశారని... ఇందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసన చేపట్టిందన్నారు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.

కర్నూల్: భవిష్యత్ లో బిసి జనార్థన్ రెడ్డి తనకు అడ్డువస్తాడనే స్థానిక ఎమ్మెల్యే ఆయనపై కక్ష పెంచుకున్నాడని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి తమ పార్టీ నాయకుడు జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేశారని... ఇందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసన చేపట్టిందన్నారు. 

''జనార్థన్ రెడ్డిపై, ఆయన అనుచరులపై ఇప్పటివరకు 26కేసులు పెట్టారు. అయితే జనార్థన్ రెడ్డి ఇంటిపైకి ఎమ్మెల్యే మనుషులొచ్చారా లేక ఎమ్మెల్యే ఇంటిపైకి జనార్థన్ రెడ్డి వెళ్లాడా? పోలీసులు తెలపాలి.     పోలీస్ యంత్రాంగం వాస్తవాలు తెలుసుకొని ప్రవర్తిస్తే వారికే మంచిది. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నఅధికారుల జాబితాను సిద్ధంచేస్తున్నాం. వారందరికీ భవిష్యత్ లో తగిన సత్కారం ఉంటుంది'' అని సోమిశెట్టి హెచ్చరించారు. 

''వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కర్నూలు జిల్లాలో ఒక్క సీటు కూడా రాదు. ఇప్పుడు వైసిపి అరాచకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనార్థన్ రెడ్డిని 40వేలకు పైగా మెజారిటీతో గెలిపిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి తప్పుతెలుసుకొని జనార్థన్ రెడ్డిని తక్షణమే విడుదలచేయాలి'' అని సోమిశెట్టి డిమాండ్ చేశారు.

read more   తాగి ఇంటిపైకి...రోడ్డుపై పోతుంటేకూడా...: బిసి జనార్ధన్ రెడ్డి భార్య ఆందోళన

ఇక మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి కూడా బిసి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ పై స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, ఆయన కుమారుడి ప్రోద్భలంతోనే జనార్థన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. వైసీపీ మూకలు రెచ్చగొట్టడం వల్లే జనార్థన్ రెడ్డి వారిని ప్రశ్నించారని... దీనికే ఆయనపై ఎస్సీ ,ఎస్టీ కేసు పెట్టారన్నారు. 

''జనార్థన్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏనాడూ ఎవరిపైనా కక్ష సాధింపులకు పాల్పడలేదు. దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడింది లేదు. పైశాచికత్వంతో టీడీపీ నేతలను అణగదొక్కడానికే వైసిపి ప్రభుత్వం కేసులు పెట్టిస్తోంది'' అని ఆరోపించారు. 

''జనార్థన్ రెడ్డికి అండగా నిలవాలని టీడీపీ తీర్మానించింది. జనార్థన్ రెడ్డి చుట్టూ ఉండేవారిని కూడా వేధించి, ఆయన్ని మానసికంగా దెబ్బతీయాలనిచూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి కక్షసాధింపులు ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటుంది'' అని అమర్నాథ్ రెడ్డి హెచ్చరించారు.
 

click me!