పొలం నుండి ఇంటికొస్తుండగా వివాహితను కొట్టి చంపిన వ్యక్తి

Published : Mar 15, 2021, 10:17 PM IST
పొలం నుండి ఇంటికొస్తుండగా వివాహితను కొట్టి చంపిన వ్యక్తి

సారాంశం

 కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం  తునికిపాడు గ్రామంలో  ముచ్చింతల రజిని నిన్న ఉదయం పొలం పనులు ముగించుకుని వస్తుండగా  అదే గ్రామానికి చెందిన గజ్జల నరసయ్య ఆమెను కొట్టి పొలంలో వేసి వెళ్లాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు భర్తకు సమాచారం ఇచ్చారు. అతను భార్యను సమీపంలోని మధిర ఆసుపత్రికి తీసుకెళ్లారు. మధిర ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

రజని మృతికి నరసయ్యే కారణమని ఆరోపిస్తూ మృతదేహంతో నరసయ్య ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సతీష్
 సిఐ శేఖర్ రంగ ప్రవేశం చేసి కుటుంబ సభ్యులకు తగు న్యాయం చేస్తామన్నారు.  నిందితుల్ని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరసనకారులు ఆందోళనను విరమించారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్