కేఆర్ఎంబీ తీరుపై ఏపీ సర్కార్ సీరియస్: కృష్ణా బోర్డుకు లేఖ

By narsimha lode  |  First Published Mar 15, 2021, 9:02 PM IST

 తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి ప్రాజెక్టుల వివాదం తెరమీదికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై నిగ్గు తేల్చాల్సిన ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది.
 


అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి ప్రాజెక్టుల వివాదం తెరమీదికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై నిగ్గు తేల్చాల్సిన ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది.

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నిర్ణయాలను తప్పుబట్టింది ఏపీ సర్కార్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన తర్వాత కూడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు సందర్శించారని ఆ లేఖలో ప్రశ్నించింది. తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులను వదిలేసి ఈ నెల  రెండో వారంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎలా సందర్శిస్తారని ఏపీ ప్రశ్నించింది.

Latest Videos

కేఆర్ఎంబీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటుందని ఏపీ నీటిపారుదల శాఖ ఆ లేఖలో ఆరోపించింది.తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్గించే నిర్ణయాలు తీసుకోవద్దని ఏపీ సర్కార్ కోరింది. 

కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి, భక్త రామదాసు, తుమ్మిళ్ల లిప్ట్ ఇరిగేషన్ పథకాలను తెలంగాణ చేపడుతోందని ఏపీ ఆరోపిస్తోంది.  నీటి కేటాయింపులు లేకుండా ఈ ప్రాజెక్టులను ఎలా నిర్మిస్తారని  ప్రశ్నించింది ఏపీ.

దిగువ రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులను దెబ్బతీసేలా తెలంగాణ వ్యవహరిస్తోందని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో ఆరోపించింది.

click me!