తప్పిన ప్రమాదం: శృంగవృక్షంలో ఆర్టీసీ బస్సులో మంటలు,ప్రయాణీకులు సురక్షితం

By narsimha lode  |  First Published May 2, 2023, 11:41 AM IST


పశ్చిమ  గోదావరి జిల్లాలో  ఇవాళ  ప్రమాదం తప్పింది.  ఆర్టీసీ బస్సులో  అగ్ని ప్రమాదం చోటు  చేసుకుంది. మంటలను  సకాలంలో గుర్తించి ఆర్పివేయడంతో  ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. 


ఏలూరు:  పశ్చిమ గోదావరి జిల్లా  శృంగవృక్షం  వద్ద  ఆర్టీసీ బస్సులో మంగళవారంనాడు మంటలు చెలరేగాయి.  ఈ  సమయంలో బస్సులో  40 మంది  ప్రయాణీకులున్నారు.   బస్సులో మంటలను గుర్తించిన వెంటనే  డ్రైవర్ రోడ్డు పక్కన బస్సును  నిలిపివేశాడు. వెంటనే   మంటలను ఆర్పారు. సకాలంలో  బస్సులో మంటలను  గుర్తించి ఆర్పివేయడంతో  పెద్ద ప్రమాదం తప్పిందని  ప్రయాణీకులు  చెబుతున్నారు. భీమవరం నుండి ఆర్టీసీ బస్సు  పాలకొల్లు వెళ్తున్న సమయంలో   మంటలు చెలరేగాయి.  అయితే  బస్సులో మంటలు ఎలా  వ్యాపించాయనే విషయమై  అధికారులు ఆరా తీస్తున్నారు.

గతంలో  కూడా  రెండు తెలుగు రాష్ట్రాల్లో  బస్సుల్లో మంటలు వ్యాపించిన ఘటనలు  చోటు  చేసుకున్నాయి.  ఈ ప్రమాద సమయంలో  ప్రయాణీకులు  సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఏడాది జనవరి మాసంలో   హైద్రాబాద్  జేఎన్‌టీయూ వద్ద  ఓ  ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది.  బస్సులో మంటను గగుర్తించిన  డ్రైవర్  బస్సును నిలిపివేశాడు. 

Latest Videos

undefined

ఉమ్మడి కృష్ణా జిల్లాలోనిపెద్దపారుపూడి మండలం పూలపర్తిగూడెం వద్ద ఆర్టీ సీ బస్సులో మంటలు చెలరేగాయి.  ఈ  సమయంలో బస్సులో  40 మంది  ప్రయాణీకులున్నారు. ఈ ఘటన 2022 అక్టోబర్ 21న  చోటు  చేసుకుంది . విజయవాడ నుండి బస్సు గుడివాడ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ఆర్టీసీ బస్సులో  మంటలు వ్యాపించాయి. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.  ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్ ప్రయాణీకులను కిందకు దింపారు.  ఈ ప్రమాదంలో  బస్సు పూర్తిగా దగ్దమైంది.ఈ ఘటన  2022 జూన్  27న జరిగింది
 
 

click me!