ఎన్డీఏలోకి వైసీపికి ఆహ్వానం: జగన్ కు మోడీ అఫర్లు ఇవే...

By telugu teamFirst Published Oct 6, 2020, 3:00 PM IST
Highlights

ఎన్డీఎలో చేరాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎన్డీఎలో చేరడం తమకు మంచిది కాదని జగన్ భావన.

న్యూఢిల్లీ: జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ)లో చేరాల్సిందిగా వైసీపీ అదినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మోడీతో వైఎస్ జగన్ మంగళవారం దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇతర అంశాలతో పాటు వైసీపీ ఎన్డీఎలో చేరే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

మోడీతో భేటీలో జగన్ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఎన్డీఎలో చేరితే రెండు క్యాబినెట్ హోదా మంత్రి పదవులు, ఓ సహాయ మంత్రి పదవి ఇస్తామని మోడీ జగన్ తో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీఎలో చేరేందుకు జగన్ సముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.

ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాష్ట్ర విభజన అంశాలను తేల్చకుండా ఎన్డీఎలో చేరితే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో జగన్ అందుకు అంగీకరించలేదని సమాచారం. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎన్డీఎలో చేరితే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి తీవ్ర విమర్శలు ఎదరువతాయని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రత్యేక హోదాను ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేనందున ఎన్డీఎ నుంచి బయటకు రావాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ వచ్చారు ఇప్పుడు తాము అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్డీఎలో చేరేందుకు జగన్ నిరాకరించినట్లు సమాచారం.

బయటి నుంచి మద్దతు ఇస్తూ రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకుంటే సరిపోతుందనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. తాము అంశాలవారీగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు గతంలో ఓసారి జగన్ మీడియాకు చెప్పారు కూడా. అదే వైఖరిని కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

click me!