ఏపీలో దారుణం... సరస్వతీదేవి విగ్రహంపై మద్యం పోసి, బాటిళ్లతో కొట్టి ధ్వంసం (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 6, 2020, 2:21 PM IST
Highlights

నరసరావుపేటలోని శృంగేరీ శంకర మఠం సమీపంలో ఉన్న సరస్వతీ దేవి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు. 

అమరావతి: గుంటూరు జిల్లా నరసరావుపేటలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని శృంగేరీ శంకర మఠం సమీపంలో ఉన్న సరస్వతీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు. అమ్మవారి విగ్రహంపై మద్యం పోసి ఆ బాటిళ్లను విగ్రహానికేసి కొట్టి పగలగొట్టారు. అంతేకాకుండా అమ్మవారి విగ్రహ ముఖ భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ  దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వీడియో

అంతర్వేది రధం దగ్దం మొదలు ఆంధ్ర ప్రదేశ్ లో ఏదో ఒకచోట హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే వున్నాయి. ఈరోజే కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా అలాంటి దుర్ఘటనే చోటుచేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. 

కర్నూలు జిల్లా..

ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు   

— Asianetnews Telugu (@asianet_telugu) 

మరోవైపు కృష్ణా జిల్లా మైలవరం మండలంలో గల గణపవరం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు పడి రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో హుండీ ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లిన హుండీలో సుమారు 35,000 నుంచి 50, 000 మధ్యలో నగదు ఉంటుంది అని గుడి కార్యదర్శి గంజి వెంకటరామిరెడ్డి అన్నారు.

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున హుండీ తెరుస్తామని... కానీ ఈ సంవత్సరం కరోన కారణముగా తీయలేదన్నారు. అందువలన హుండీలో అధిక మొత్తంలో డబ్బు ఉంటుందని గ్రామస్తులు, గుడి కమిటీ మెంబెర్స్ అన్నారు.  ఈ చోరీపై పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

read more  

ఇక ఇటీవల చిత్తూరు జిల్లాలోని గంగాధనెల్లూరు మండలం అగరమంగళంలోని ఓ దేవాలయంలో నంది విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. అలాగే కృష్ణా జిల్లాలో ఓ పురాతన దేవాలయంలో కూడా నంది విగ్రహాన్ని అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగ్గొట్టారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 అంతర్వేదిలో ఘటనను ఇంకా పూర్తి స్థాయిలో మరువక ముందే ఇలాంటి వరుస సంఘటనలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. షిర్డీ సాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు ఈ దాడులను నిరిసిస్తూ నిరసన బాట పట్టాయి. ఇలా హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు ఏపీ రాజకీయాలనూ వేడెక్కిస్తున్నాయి. 

click me!