నారాయణ మదిలో గుబులు

Published : Dec 03, 2016, 07:14 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
నారాయణ మదిలో గుబులు

సారాంశం

నెల్లూరు జిల్లాలో నారాయణ పట్టుకోల్పోతున్నారా? గతంలో కలెక్టర్ ను తనకు చెప్పకుండా నియమించారు. ఇపుడు మునిసిపల్ కమిషనర్ ని మారిస్తే గొడవ వుతున్నది

మునిసిపల్ మంత్రి నారాయణకు జిల్లా సమస్య అయి కూర్చుంది.

 

సొంత జిల్లా నెల్లూరు తన  గ్రిప్పులో నుంచి జారి పోతున్నదనే  అనుమానం ఆయన్నీమధ్య పీడిస్తూ ఉంది. సొంతజిల్లాలో మంత్రి పట్టుకోల్పోతున్నాడనే అనుమానం ప్రజల్లో నాటుకొనక ముందే ఆయన ఏదో ఒక పనిచేసి జిల్లాలో తనే ప్రథమ పౌరుడని ప్రకటించదలుకున్నాడు. అందుకే ఉన్నఫలానా  నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు ను బదిలీచేయించాడు.

 

అంతటితో ఆగలేదు.


అభివృద్ధి పనులను వేగంగా నడిపించడంలో కమిషనర్‌ విఫలమయ్యారని ఆరోపిస్తూ, కార్పొరేషన్‌లో తనకు తెలియకుండా ఏ పని జరగరాదని హుకుం జారీ చేశారు.  

 

అయితే, ఇది మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్ ను ఇరుకు పెట్టింది. తాను మినిస్టర్ని అనకుంటే, నేను మేయర్ని నా సంగతేమింటేంటి, మేయర్ కు తెలియకుండా కమిషనర్ ను ఎట్లాబదిలీ చేస్తారని అజీజ్ నిలదీస్తున్నాడు.

 

రొట్టెల పండగ సందర్భంగా జరిగిన ఒకటీ అర చిన్న పొరపాట్ల మీద కమిషనర్ ను బదిలీ చేయడం కుదరదని, అది   కార్పొరేషన్  పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను కుంటుపరస్తుందని అజీజ్ వాదిస్తున్నారు. ఆయన ఏకంగా ఈ పంచాయతీని పార్టీ జనరల్ సెక్రెటరీ నారా లోకేశ్ బాబు దాకా ఆయన తీసుకువెళ్లి, ఎలాగయినా సరే కమిషనర్ బదిలీ మార్పించాలని పంతం పట్టినట్లు తెలిసింది. సొంత పార్టీకే చెందిన మేయరు ఉన్నపుడు కార్పొరేషన్  అంతర్గత వ్యవహారాలలో మంత్రి నేరుగా జోక్యం చేసుకోకూడదనేది  మేయర్ వాదన.

 

ముఖ్యమంత్రి బాబు దగ్గిర మునిసిపల్ మంత్రి నారాయణ వెలుగు కొంత తగ్గినట్లు చెబుతున్నారు.   దీనికి రుజువుగా కలెక్టర్ పోస్టింగ్  రుజువుగా చూపిస్తున్నారు.  ఐఎఎస్ ఆపీసర్ రేవు ముత్యాలరాజును నెల్లూరు కలెక్టర్ గా  పోసింగ్ ఇస్తున్నపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  మంత్రి  నారాయణకు మాట వరసకు చెప్పలేదట. అంతకు ముందు సిఆర్ డి ఎ కమిషనర్ శ్రీకాంత్ ని బదిలీ చేసేశారు.

 

అంతేకాదు,కలెక్టర్ సమక్షంలోనే  ‘రాజుకు జిల్లాలో ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది, ఎవరి జోక్యం ఉండదు, చక్కగా పనిచేయ్ రాజు,’  అని ఫుల్ మద్ధతిస్తూ , మంత్రి నారాయణ వైపు తిరిగి  ‘ ‘నారాయణకేమయినా  అవసరమయితే, నేనున్నా’ నని హమీ ఇచ్చాడట ముఖ్యమంత్రి. అప్పటినుంచి నారాయణ మనుసులో గుబులు మొదలయింది. అలాంటపుడు అజీజ్ కూడా మేయర్ పేరుతో నెల్లూరులో స్వాతంత్య్రం  ప్రకటిస్తున్నాడు.

 

 ఇలా జరిగితే బతకడమెలా ? ఎందుకంటే, తాను మునిసిపల్ శాఖ మంత్రి అయినా,  ఏ ఒక్క కమిషనర్ ని బదిలీచేయలేడు. కారణం,ఏవూర్లోనయినా కమిషనర్లను లేపేస్తే అక్కడి అధికార పార్టీ శాసనసభ్యులకో ఎంపిలకో, లేదా మంత్రులకో కోపం వస్తుంది.  ఇతర జిల్లాలలో చేయి పెట్ట వీలు లేదు. ఇక మిగిలింది, సొంత జిల్లా నెల్లూరే. కనీసం నెల్లూరు కమిషన ర్నయినా మార్చి తన పలుకుబడి సాగుతూ ఉందని నిరూపించుకోవలసి వచ్చింది.

 

ఇపుడు దీనికి వ్యతిరేకతవచ్చింది. దానికి ఒక పుకారు జిల్లాలో షికారు చేస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో  బాగా ధనవంతుడయిన నారాయణను  నెల్లూరు ఎంపి స్థానానికి పోటీచేయిస్తారని చెబుతున్నారు. ఆయనొక్కరే వైఎస్ఆర్ సి ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి కి సరయిన పోటీ అని నాయకత్వం భావిస్తున్నదట.

 

PREV
click me!

Recommended Stories

Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu
Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu