నరసరావుపేటలో కరోనా విజృంభణ: మిషన్ మే 15 పేరుతో అధికారుల యాక్షన్

By Siva Kodati  |  First Published May 6, 2020, 2:44 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం  గుంటూరు జిల్లాలో 12 కొత్త కేసులు నమోదుకావడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం గుంటూరు జిల్లాలో 12 కొత్త కేసులు నమోదుకావడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 362కి చేరింది.

వీటిలో అత్యథిక కేసులు కేవలం గుంటూరు, నరసరావుపేటలోనే కావడం గమనార్హం. గుంటూరు సిటీలో కోవిడ్  19 బాధితుల సంఖ్య 162 కాగా.. నరసరావుపేట పట్టణంలో 163కి చేరింది.

Latest Videos

undefined

Also Read:విజయనగరం జిల్లాకు సైతం పాకిన కరోనా: తొలి పాజిటివ్ కేసు నమోదు

జిల్లావ్యాప్తంగా ఇంకా 500కు పైగా నమూనాల ఫలితాలు రావాల్సి  ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కోవిడ్‌తో 8 మంది మరణించగా.. 129 కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇంకా 226 మంది గుంటూరు ఐడీ, మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో జిల్లాలో ఈ నెల 17 వరకు లాక్‌డౌన్ యథాతథంగా కొనసాగుతుందని ఎలాంటి సడలింపులు ఉండవని అధికారులు వెల్లడించారు. వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టామని.. 20 కంటైన్‌మెంట్ జోన్లు ఉండగా... వాటిని 59 క్లస్టర్లుగా విభజించారు.

Also Read:తమిళనాడు అధికారుల నిర్వాకం: చిత్తూరు సరిహద్దుల్లో రోడ్డుపై గొయ్యి,రాకపోకలు బంద్

కేసుల సంఖ్యను బట్టి క్లస్టర్లను ఏర్పాటు చేశామని.... ఈ ప్రాంతాల్లో ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కువ కేసులు నమోదైన నరసరావుపేటలో మిషన్ 15 పేరుతో కార్యాచరణ ప్రారంభించామని.. 15 రోజుల తర్వాత కొత్త కేసులు ఉండరాదనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. 

click me!