నీ సరదాను మేమెందుకు కాదంటాం? వడ్డీతో సహా వడ్డిస్తాం: జగన్ కు లోకేష్ వార్నింగ్

By Arun Kumar P  |  First Published Sep 17, 2021, 2:48 PM IST

తమ ఇంటిపైకి వైసిపి గూండాలను పంపడం ఎందుకు జగన్ రెడ్డి...ఓసారి నువ్వే వ‌చ్చి మా పెద్దాయ‌న దగ్గర రాష్ట్ర అభివృద్ధి గురించి, కొత్త ప‌రిశ్ర‌మ‌లు ఎలా తీసుకురావాలి, ఉపాధి-ఉద్యోగావ‌కాశాలు ఎలా పెంపొందించాలో తెలుసుకొని వెెళ్లు అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.


అమరావతి: తమ ఇంటివద్ద జరిగిన ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఓ ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి రౌడీమూకలను పంపి సీఎం జగన్ రాజకీయంగా మరింత దిగజారిపోయారని లోకేష్ మండిపడ్డారు. 

''ప్ర‌తిప‌క్ష‌నేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేనీ, బులుగు గూండాల‌ని పంపావంటేనే తాడేప‌ల్లి కొంప‌లో ఎంతగా వ‌ణికి చస్తున్నావో అర్థం అవుతోంది. ఇంత‌కంటే నువ్వు దిగ‌జార‌వ‌ని అనుకున్నప్ర‌తీసారీ ఇంకా అధఃపాతాళంలోకి దిగ‌జారుతూనే వున్నావు. నీ తాడేప‌ల్లి ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూర‌మో, మా ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరం. ఆ రోజు కూడా ఎంతో దూరంలేకుండా నువ్వే తెచ్చుకుంటున్నావు'' అంటూ లోకేష్ హెచ్చరించారు.

Latest Videos

''నీ గాలి హామీలు తేలిపోయాయి.... నీ ముద్దులు పిడిగుద్దుల్లా ప‌డుతున్నాయి. జ‌గ‌న్ ది అంతా నాట‌కమ‌నీ జ‌నానికి తెలిసిపోయింది. జ‌నం తిర‌గ‌బ‌డే రోజు ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని, ఉలిక్కిప‌డి ప్ర‌తిప‌క్షంపైకి వాళ్ల‌నీ, వీళ్ల‌నీ పంప‌డం ఎందుకు? నువ్వే ఓ సారి వ‌చ్చిపోకూడ‌దు. మా పెద్దాయ‌న నీలాంటి క్రూర‌, నేర‌స్వ‌భావం ఉన్నోడు కాదు'' అన్నారు.

''నువ్వు ముంచేయాల‌ని నిత్యం త‌పించే క‌ర‌క‌ట్ట ప‌క్క ఇంట్లో టీ, స్నాక్స్ పెట్టి... బొత్తిగా నీకు తెలియ‌ని అభివృద్ధి అంటే ఏంటి? కొత్త ప‌రిశ్ర‌మ‌లు ఎలా తీసుకురావాలి? ఉపాధి-ఉద్యోగావ‌కాశాలు ఎలా పెంపొందించాలి? అనే అంశాలు చ‌క్క‌గా వివ‌రిస్తారు. కాదూ-కూడ‌దు ఇలాగే బ్లేడ్ బ్లాచ్‌ల‌ను వేసుకొచ్చేస్తానంటే, నీ స‌ర‌దాని మేమెందుకు కాదంటాం? ఒక్కొక్కళ్ళకి వడ్డీతో సహా వడ్డిస్తాం'' అని లోకేష్ హెచ్చరించారు.

read more   ఖబర్దార్ జగన్ రెడ్డి... ఇంతకింతా బదులు తీర్చుకుంటాం: అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్

చంద్రబాబు ఇంటివద్ద జరిగిన టిడిపి, వైసిపి శ్రేణుల ఘర్షణలో మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న స్వల్పంగా గాయపడ్డారు. వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ నేత్రుత్వంలో ఆ పార్టీ నాయకులు చంద్రబాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించగా వారిని నిలువరించేందుకు స్వయంగా బుద్దా వెంకన్న రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య తోపులాట, పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చోటుచేసుకుంది. దీంతో బుద్దా వెంకన్న సొమ్మసిల్లి రోడ్డుపైనే పడిపోయారు. 

వైసిపి ఎమ్మెల్యే  జోగి రమేష్ పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ళదాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ, వైసిపి నాయకులు పరస్పరం తోపులాటకు దిగి రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలువురు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 

click me!