చంద్రబాబు ఇంటివద్ద ఘర్షణ... వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ పై దాడి, రాళ్లదాడిలో కారు ధ్వంసం (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 17, 2021, 1:47 PM IST
Highlights

మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటి ముట్టడికి  ఎమ్మెల్యే జోగి రమేష్ తో పాటు వైసిపి కార్యకర్తలు ప్రయత్నించగా వారిని టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు పార్టీల నాయకులు పరస్పర దాడుకుల పాల్పడ్డారు. 

అమరావతి: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉద్రిక్తత నెలకొంది. వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు ఇంటివద్దకు టిడిపి శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. 

ఎమ్మెల్యే  జోగి రమేష్ పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ళదాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ, వైసిపి నాయకులు పరస్పరం తోపులాటకు దిగి రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలువురు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.  

వీడియో

టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య పరస్పర నినాదాలతో చంద్రబాబు ఇంటివద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ వర్గీయులకు పోలీసులు సర్దిచెప్పి అక్కడినుండి పంపే ప్రయత్నం చేస్తున్నారు. జోగి రమేష్‍ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల యత్నిస్తున్నారు. రాళ్లు రువ్వుకుంటున్న ఇరుపార్టీల కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి చేశారు. 

చంద్రబాబు ఇంటి వద్ద ఎమ్మెల్యే జోగి రమేష్, వైసిపి కార్యకర్తలు బైఠాయించారు. తన పార్టీ నాయకుడి అనుచిత వ్యాఖ్యలపై స్పందించి చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే చంద్రబాబు బయటకు రావాలని జోగి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో ఆయనను తిరగనివ్వమని హెచ్చరించారు. టిడిపి నేతలను చంద్రబాబే రెచ్చగొడుతున్నాడని జోగి రమేష్ ఆరోపించారు. 

click me!