ఏపీలో బీజేపీ ఒక్క కార్పొరేటర్ స్థానం కూడా గెలవదు:లోకేష్

By Nagaraju TFirst Published Nov 20, 2018, 5:11 PM IST
Highlights

బీజేపీపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క కార్పొరేటర్‌ స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. నెల్లూరులో ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోడం వల్లే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. 

అమరావతి: బీజేపీపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క కార్పొరేటర్‌ స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. నెల్లూరులో ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోడం వల్లే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ వెన్నుపోటు పొడిచిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రూ.3వేల కోట్లు ఇచ్చిన కేంద్రం ఏపీ రాజధానికి రూ.1500 కోట్లే ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి సాయం చేసే మనసు కేంద్రానికి లేదని లోకేష్ ధ్వజమెత్తారు. 

మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైనా మండిపడ్డారు నారా లోకేష్. తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శించే తీరిక కూడా ప్రతిపక్ష నేత జగన్ కు లేదంటూ చురకలంటించారు. పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నా కనీసం పలకరించలేదని విమర్శించారు లోకేష్.

click me!