తెలంగాణ ఎన్నికలు: జగన్, పవన్‌లపై బాబు డౌట్ ఇదీ...

By narsimha lodeFirst Published Nov 20, 2018, 5:09 PM IST
Highlights

రాష్ట్రానికి అన్యాయం చేసినా కూడ పవన్ కళ్యాణ్,  జగన్‌లు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు

నెల్లూరు: రాష్ట్రానికి అన్యాయం చేసినా కూడ పవన్ కళ్యాణ్,  జగన్‌లు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్  సినిమా ముగిసిందన్నారు. తమ పార్టీ ఎంపీలపై మోడీ దాడులు నిర్వహిస్తున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రజల తరపున పోరాటం చేస్తోంటే ఐటీ దాడులు చేస్తూ భయపెడుతున్నారని చెప్పారు.తెలంగాణలో జగన్, పవన్ కళ్యాణ్‌లు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు.  లాలూచీ రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు.

నెల్లూరులో  మంగళవారం నాడు నిర్వహించిన  సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. కేసీఆర్ కు మెచ్యూరిటీ ఉందని... నాకు మెచ్యూరిటీ లేదని  మోడీ విమర్శలు చేశారని  చెప్పారు. కేసీఆర్  మన పార్టీలోనే ఉన్నాడని  చెప్పారు. తన వద్ద కేసీఆర్ పనిచేశాడన్నారు. మోడీనే అవినీతి ఉచ్చులో పడ్డాడని చెప్పారు. లాలూచీ రాజకీయాలను తాను ఏనాడూ చేయలేదన్నారు. కేసీఆర్, జగన్‌ లతో  లాలూచీపడ్డారని  చెప్పారు.  ఈ సమయంలో వపన్ కళ్యాణ్ కొత్తగా తెరమీదికి తీసుకొచ్చారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.

తెలంగాణలో  వైసీపీ, పవన్ కళ్యాణ్ లు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. ఈ మూడు పార్టీల రాజకీయ లాలూచీకి ఇది నిదర్శమని చంద్రబాబునాయుడు  విమర్శించారు.

పార్లమెంట్ లో  అవిశ్వాసం ప్రవేశపెడితే తాను ఎంపీలను కూడగడుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లాడన్నారు.  సినిమాలో మాదిరిగా పవన్ కళ్యాణ్ డైలాగ్ లు కొట్టాడన్నారు. సినిమా అయిపోయిందని  పవన్ కళ్యాణ్ పత్తా లేకుండా పోయాడని  ఆయన చెప్పారు.

జగన్‌పై ఉన్న కేసులతో  రాష్ట్రానికి బీజేపీకి అన్యాయం చేసినా జగన్ నోరు తెరవడం లేదన్నారు. జగన్ నోరు తెరిస్తే  కేసులు  మెడకు చుట్టుకొంటాయని జగన్ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.  అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలను గురించి మాట్లాడరని  చంద్రబాబునాయుడు  వైసీపీపై విమర్శలు గుప్పించారు.

ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి సుమారు రూ.75వేల కోట్లు రావాల్సి ఉందని నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి తేల్చిన జనసేన  చీఫ్  పవన్ కళ్యాణ్  గుర్తించారని... కానీ దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

ఈ దఫా ఏపీలో  25 ఎంపీ సీట్లలో టీడీపీ ఎంపీలను  గెలిపించే బాధ్యతను ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త తీసుకోవాలని   చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు.వచ్చే ఎన్నికల్లో  టీడీపీ సత్తాను చూపుతామని ఆయన తెలిపారు. వపన్ కళ్యాణ్ సినిమా అయిపోయిందన్నారు.

హైద్రాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది తానేనని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. హైద్రాబాద్‌ను ఎవరు అభివృద్ధి చేశారో ఎవర్ని అడిగినా చెబుతారని చెప్పారు. ఏపీకి ఎందుకు నమ్మకద్రోహం చేసిందో చెప్పాలని ఆయన  బీజేపీని డిమాండ్ చేశారు.

రాష్ట్రాభివృద్ధి కోసమే ఆనాడు బీజేపీలో పొత్తు పెట్టుకొన్నట్టు ఆయన చెప్పారు.తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హమీలను కూడ మోడీ సర్కార్ విస్మరించిందని ఆయన తెలిపారు.

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని  మోడీ  హమీ ఇచ్చారన్నారు. కానీ, మట్టి, నీరు తీసుకొచ్చి తమ మనసులో మాటను బయటపెట్టారని చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతు అవుతోందన్నారు.తెలుగువారికి ప్రపంచం గర్వపడేలా రాజధానిని నిర్మిస్తామని బాబు తేల్చి చెప్పారు. 

ఫార్మూలా వన్ బోట్ రేసింగ్ పెడితే  సుమారు 72 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారని ఆయన గుర్తుచేశారు. సంపద సృష్టించే నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నట్టు బాబు తేల్చి చెప్పారు.దేశంలో ఎవరొచ్చినా కూడ అమరావతికి కూడ వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

తెలుగువారి తడాఖా మీకు తెలియదు. ఒక్కసారి తెలుగు వారు తలుచుకొంటే చిత్తు చిత్తుగా ఓడిస్తారని బీజేపీని  చంద్రబాబునాయుడు హెచ్చరించారు. విశాఖలో రైల్వే జోన్ ను అడ్డుకొంటున్నారని బాబు  విమర్శించారు.

కేంద్రం దయదక్షిణ్యాలపై తాము ఆధారపడడం లేదన్నారు. బాధ్యతను మర్చిపోయి పెత్తనం చేస్తామంటే కుదరదన్నారు. అన్నింట్లో ఏపీ రాష్ట్రం నెంబర్ గా నిలుస్తోందన్నారు. అయితే  ఈ విషయం కేంద్రానికి నచ్చడం లేదని చంద్రబాబునాయుడు విమర్శించారు.

రాష్ట్రంలోని నాలుగు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోందన్నారు. కేంద్రం ఒక్క పోర్టును నిర్మిస్తోందని చెప్పారు. ఈ పోర్ట్ నిర్మాణ పనులపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

పటేల్ విగ్రహనికి,  ముంబైలో మెట్రో కోసం వేలాది కోట్లు ఖర్చు చేశారు, కానీ విభజన చట్టంలో పొందుపర్చిన వాటిని కూడ ఇవ్వకుండా కేంద్రం అమలు చేయడం లేదన్నారు.

click me!
Last Updated Nov 20, 2018, 5:09 PM IST
click me!