మొన్న ప్రొద్దుటూరు, ఇప్పుడు గురజాల... వరుసగా టిడిపి నేతలను హత్య చేయించి ఫ్యాక్షన్ సీఎం జగన్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నాడు అని లోకేష్ మండిపడ్డాడు,
గుంటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురైన ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో అదే పార్టీకి చెందిన నేత హత్యకు గురయ్యాడు.దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో తెలుగుదేశం పార్టీ నేతను ప్రత్యర్ధులు హతమార్చారు. ఈ హత్యపై సోషల్ మీడియా వేదికన స్పందిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు.
''రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకులకు రక్షణ లేకుండా పోయింది.మొన్న ప్రొద్దుటూరు, ఇప్పుడు గురజాల వరుసగా టిడిపి నేతలను హత్య చేయించి ఫ్యాక్షన్ సీఎం జగన్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నాడు'' అంటూ ట్విట్టర్ వేదికన మండిపడ్డాడు నారా లోకేష్.
''పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు గారిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చారు వైకాపా రౌడీలు. జగన్ రెడ్డి హత్యారాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను'' అన్నారు.
read more హత్యలతో టీడీపీ కార్యకర్తలకు బెదిరింపులు.. ఖబడ్దార్ జగన్ రెడ్డి : అచ్చన్నాయుడు
''గ్రామ సర్పంచ్ గా 15 ఏళ్ళ పాటు పనిచేసి గ్రామ అభివృద్ధి కి ఎంతగానో కృషి చేసిన పురంశెట్టి అంకులు గారిని రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా గూండాలు హత్య చెయ్యడం దారుణం. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా?శాంతి భద్రతలు ఉన్నాయా?'' అని లోకేష్ ప్రశ్నించారు.
''కత్తిని నమ్ముకున్న వాడు అదే కత్తికి బలైపోతాడు అనే సత్యాన్ని జగన్ రెడ్డి త్వరగా గ్రహిస్తే మంచిది'' అంటూ టిడిపి నాయకుడు పురంశెట్టి అంకులు హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.