వైరల్ గా మారిన కేటీఆర్, లోకేష్ ట్వీట్లు

First Published Jul 11, 2018, 2:04 PM IST
Highlights

ఏపీ 98.42 శాతం స్కోరుతో టాప్ పొజిషన్లో నిలవగా.. తెలంగాణ 98.33 శాతం స్కోరుతో రెండో స్థానం నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రాల ర్యాంకింగ్స్‌ను ప్రపంచ బ్యాంక్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ సంయుక్తంగా రూపొందిస్తాయి. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తా చాటాయి. మంగళవారం ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.

ఏపీ 98.42 శాతం స్కోరుతో టాప్ పొజిషన్లో నిలవగా.. తెలంగాణ 98.33 శాతం స్కోరుతో రెండో స్థానం నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రాల ర్యాంకింగ్స్‌ను ప్రపంచ బ్యాంక్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ సంయుక్తంగా రూపొందిస్తాయి. 

కాగా.. తమకు రెండో ర్యాంకు వచ్చిన విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)లో కేవలం 0.09% తేడాతో మేము మొదటి ర్యాంకును కోల్పోయాం. అయినా మంచి స్థానంలోనే నిలిచాం. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో పని చేస్తూ అధికారులు ఈ ఏడాది కూడా మంచి ర్యాంకు సాధించేలా చేశారు’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈవోడీబీలో తొలి ర్యాంకు సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు అభినందనలు తెలిపారు.

కాగా.. కేటీఆర్ ట్వీట్ కి ఏపీ మంత్రి నారా లోకేష్ బదులిచ్చారు. ‘‘ఇక్కడ ఒకటీ, రెండు తేడా లేదు. తెలుగు రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. ఇది మన తెలుగు ప్రజల అభివృద్ధికి దోహదపడుతుంది. మీకు కూడా అభినందనలు’’ అని తెలిపారు. కాగా.. ఇద్దరు మంత్రులు ఒకరు చేసిన ట్వీట్ కి మరొకరు రిప్లై ఇవ్వడంతో  ఆ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
 
click me!