లోకేశ్ ను ఆయన హిప్నటైజ్ చేసుంటాడు, అందువల్లే ఈ ప్రకటన : టిజి వెంకటేశ్

First Published Jul 11, 2018, 12:34 PM IST
Highlights

కర్నూల్ జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి లోకేశ్ ప్రకటనపై సీనియర్ నాయకులు టిజి వెంకటేశ్ స్పందించారు. మంత్రిని ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేసుంటాడని, అందువల్లే లోకేశ్ కర్నూల్ అభ్యర్థులను ప్రకటించాడని అన్నారు. అయినా అభ్యర్థులను ప్రకటించే అధికారం మంత్రి లోకేశ్ కి లేదని, ఆయనేమైనా టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడా? అని టిజి ప్రశ్నించారు.

ఇటీవల కర్నూల్ జిల్లాలో పర్యటించిన మంత్రి లోకేశ్...   2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు స్థానం నుంచి టిడిపి ఎంపి, ఎమ్మెల్యేలుగా పోటీచేసే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూల్ ఎంపిగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారని ఓ బహిరంగ సభలో లోకేశ్ వెల్లడించారు.వారిద్దరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రకటనపై స్థానికి టిడిపి నాయకులు టిజి వెంకటేశ్ కాస్త ఘాటుగానే స్పందించారు. లోకేశ్ మాటలు విని తాను షాక్ కు గురయ్యానని అన్నారు. అయినా ప్రభుత్వం తరపున చేపట్టిన అధికారిక కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులను మంత్రి ఎలా ప్రకటిస్తారని వెంకటేశ్ ప్రశ్నించారు. లోకేశ్ ను ఇలా ఎవరు మాట్లాడించారో తనకు తెలుసని  అన్నారు. ఈ నిర్ణయాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు టిజి వెంకటేశ్ స్పష్టం చేశారు.

click me!