ఆరు నెలలకోసారి ఉద్యోగ మేళా: టీడీపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన లోకేష్

By narsimha lodeFirst Published Feb 26, 2021, 11:27 AM IST
Highlights

నిరుద్యోగులకు ప్రతి ఆరు మాసాలకు ఓసారి ఉద్యోగ మేళాను నిర్వహిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. 
 


అమరావతి: నిరుద్యోగులకు ప్రతి ఆరు మాసాలకు ఓసారి ఉద్యోగ మేళాను నిర్వహిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. శుక్రవారం నాడు మంగళగిరిలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విడుదల చేశారు. 10 అంశాలతో పురపాలక ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. పల్లెలు గెలిచాయి ఇప్పుడిక మనవంతు పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

శుభ్రమైన ఊరు, శుద్దమైన నీటి కోసం చర్యలు తీసుకొంటామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. రూ. 5లకే కడుపు నిండా భోజనం పెడతామని టీడీపీ తెలిపింది.నిరుద్యోగ యువత కోసం ఆరు మాసాలకు ఓసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామన్నారు.

పాత పన్నుల మాఫీ, చెల్లించాల్సిన బకాయిలు పూర్తిగా  రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. చెత్తలేని నగరాలుగా తీర్చిదిద్దుతామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ  హామీ ఇచ్చింది.స్వయం సహాయక సంఘాలకు  వడ్డీలేని రుణాలు అందిస్తామని మేనిఫెస్టోలో టీడీపీ హామీని ప్రకటించింది.పట్టణ పేదలందరికీ టిడ్కో గృహాలను పంపిణీ చేస్తామని లోకేష్ తెలిపారు.

click me!