బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Jan 16, 2019, 6:23 PM IST
Highlights

ముగ్గురు మోడీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 


అమరావతి: ముగ్గురు మోడీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో  టీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడంపై ట్విట్టర్ వేదికగా నారా లోకేష్   బుధవారం నాడు విమర్శలు గుప్పించారు. 
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హైద్రాబాద్‌లో సమావేశమైన విషయం తెలిసిందే.ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీలు ఒక్కటయ్యారని లోకేష్  విమర్శించారు. ఇంతకాలం పాటు వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం బట్టబయలైందన్నారు. 

లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులు, ఏపీలో పుట్టినవాళ్లంతా కూడ వారి వారసులేనని కేసీఆర్ ఆంధ్రులను అవమానించారని గుర్తు చేశారు. ఆంధ్రా బిర్యానీ పేడ బిర్యానీ అంటూ అవహేళన చేసిన కేసీఆర్‌తో జగన్ మోడీ రెడ్డి జతకట్టారని లోకేష్ చెప్పారు.

నాలుగున్నర ఏళ్లుగా విభజన చట్టం ప్రకారంగా ఏపీకి దక్కాల్సిన వాటా దక్కకుండా అడ్డుపడుతున్న కేసీఆర్‌తో కలిసి  ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్‌‌ను జగన్ ఏర్పాటు చేశారని లోకేష్ ఆరోపించారు.

 

 

నాలుగున్నర ఏళ్ల పాటు విభజన చట్టం ప్రకారం అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వాటా దక్కకుండా అడ్డుపడుతున్న కేసీఆర్ గారితో కలిసి జగన్ ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్ ఏర్పాటు చేసారు !!!

— Lokesh Nara (@naralokesh)

 

లంకలో పుట్టినవాళ్లు అంతా రాక్షసులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా వారి వారసులు అని ఆంధ్రులను అవమానించిన కేసీఆర్ గారు, ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుంది అని అవహేళన చేసిన కేసీఆర్ గారితో జగన్ మోడీ రెడ్డి జత కట్టారు

— Lokesh Nara (@naralokesh)

 

ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీ ఒక్కటయ్యారు. ఇంత కాలం వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం, ఇప్పుడు బహిర్గతం అయ్యింది!

— Lokesh Nara (@naralokesh)

 


 

సంబంధిత వార్తలు

జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని

 

click me!
Last Updated Jan 16, 2019, 6:28 PM IST
click me!