వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తా...: మంత్రి అనిల్ కుమార్ యాదవ్(వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jun 14, 2021, 12:31 PM IST
వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తా...: మంత్రి అనిల్ కుమార్ యాదవ్(వీడియో)

సారాంశం

ఇవాళ నెల్లూరు నగరంలోని ఉడ్ హౌస్ సంఘంలో నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. 

నెల్లూరు నగర ప్రజలు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే ఈరోజు మంత్రి స్థాయికి చేరుకున్నానని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఉడ్ హౌస్ సంఘంలో పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తనను  నమ్మిన వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం తనదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు... కుటుంబ సభ్యుల మించి తనకు తనను నమ్ముకున్న వాళ్ళు ముఖ్యమన్నారు.. తనను నమ్మిన తమ వెంట నడుస్తున్న అనుచరులను ఏనాడు మరిచిపోనన్నారు. 

వీడియో

కొంతమంది ఇళ్లల్లో కూర్చొని చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఇలాంటి విమర్శలకు భయపడనన్నారు.. తాను మంచి చేస్తే ప్రజలు ఆదరిస్తారని తాను తప్పు చేస్తే ప్రజలే తగిన తెలుపు ఇస్తారన్నారు.. 2024లో తేల్చుకుంటామని ఆయన తనదైనశైలిలో సవాల్ విసిరారు... చౌక బారు విమర్శలు చేసే వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నీళ్ళొద్దు గొడవలే కావాలిఅనే రకం వాళ్ళది: సీఎం | Asianet News Telugu
CM Chandrababu Naidu: రైతులతో కలిసి పొలానికి వెళ్లిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu