చిత్తూరులో దళిత న్యాయమూర్తిపై వైసిపి దాడి... నారా లోకేష్ సీరియస్

By Arun Kumar PFirst Published Jul 16, 2020, 1:17 PM IST
Highlights

రాజారెడ్డి రాజ్యాంగంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని... సీఎం జగన్ రెడ్డి రాక్షస పాలనలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.

గుంటూరు: రాజారెడ్డి రాజ్యాంగంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని... సీఎం జగన్ రెడ్డి రాక్షస పాలనలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో దళిత న్యాయమూర్తి రామకృష్ణ గారిపై అధికార పార్టీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. 

అధికార పార్టీ నేతల అరాచకాలను బయటపెడుతున్నందుకు న్యాయమూర్తి రామకృష్ణని వేధిస్తూ భౌతికదాడి చెయ్యడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను బయటపెడుతున్నందుకు జగన్ రెడ్డి దళితులపై కక్ష కట్టారని ఆరోపించారు. 

అనంతపురం జిల్లాలో అధికార పార్టీ గుండాలు దళిత రైతులపై దాడి చేసి భూమి లాక్కోవడానికి ప్రయత్నించారని...అలాగ చిత్తూరులో న్యాయమూర్తి రామకృష్ణపై దాడి చేసారన్నారు. ఇలా ఒకే రోజు రెండు ఘటనలు చోటుచేసుకోవడం దారుణమన్నారు. 

read more  వైసిపి ప్రభుత్వంలో పైలట్ పాత్ర ఆయనదే: యనమల సంచలనం

గతంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ పై అక్రమ కేసులు పెట్టారని గుర్తుచేశారు లోకేష్. అలాగే అవినీతిని సహకరించలేదని డాక్టర్ అనితారాణిని వేధించారన్నారు. కచ్చులూరు బోటు ప్రమాదం వెనుక వాస్తవాలు బయట పెట్టినందుకు మాజీ ఎంపీ హర్ష కుమార్ పై కేసులు పెట్టారని లోకేష్ పేర్కొన్నారు. 

అధికార మదంతో దళితుల భూములు లాక్కోవడం దారుణమన్నారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారు మూల్యం చెల్లించుకోక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు. 

click me!