తుమ్మపుడిలో తీవ్ర ఉద్రిక్తత: ప్రభుత్వం 21 రోజుల్లో నిందితులను శిక్షించాలి.. నారా లోకేష్

Published : Apr 28, 2022, 06:53 PM IST
తుమ్మపుడిలో తీవ్ర ఉద్రిక్తత: ప్రభుత్వం 21 రోజుల్లో నిందితులను శిక్షించాలి.. నారా లోకేష్

సారాంశం

గుంటూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుమ్మపుడిలో అత్యాచారం, హత్యకు గురైన మహిళ బంధువులను నారా లోకేష్ పరామర్శించేందుకు గురువారం అక్కడికి వెళ్లారు. అయితే లోకేష్ అక్కడికి వెళ్లిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

గుంటూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుగ్గిరాల మండలం తుమ్మపుడిలో అత్యాచారం, హత్యకు గురైన మహిళ బంధువులను నారా లోకేష్ పరామర్శించేందుకు గురువారం అక్కడికి వెళ్లారు. అయితే లోకేష్ అక్కడికి వెళ్లిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లోకేష్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాళ్లు, కొబ్బరి బొండాలు విసురుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలతో పాటు పాటు పలువురు పోలీసులుకు గాయాలు అయ్యాయి. లోకేష్‌పై వైసీపీ నాయుకులు కావాలనే దాడికి యత్నించారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. 

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు చట్టాలపై గౌరవం, భయం లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు జరిగితే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 800 మంది మహిళలపై దాడి జరిగిందన్నారు. దాడులు జరిగితే బుల్లెట్ కన్నా వేగంగా వస్తానన్న జగన్ ఎక్కడ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. నిన్న కొందరు మద్యం సేవించి మహిళపై దాడి చేసి హత్య చేశారని అన్నారు. ఈ ఘటనలో ముగ్గురి పాత్ర ఉందని మృతురాలి బంధువులు చెబుతున్నారని అన్నారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు చేసినా కేసులు పెట్టలేదని తెలిపారు. 

రాష్ట్రంలో సీఎం జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లేని దిశా చట్టం ఉందని చిత్రీకరిస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో మాఫియ రాజ్యం ఉందన్నారు. తనపై దాడి చేసిన భయపడే ప్రసక్తే లేదని లోకేష్ అన్నారు. వైసీపీ నాయకుల దాడిలో తమ కార్యకర్తలకు గాయపడ్డారు. ఇక తాను మూర్ఖుడినే అని.. ఎవరినీ వదలిపెట్టనని అన్నారు. పోస్టుమార్టమ్ జరగకుండానే.. అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా నిర్దారిస్తారని ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడి ఉందని నిలదీశారు. ఎస్పీ కాల్ డేటా రికార్డు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలా చెప్పమని ఎస్పీపై ఒత్తిడి తెచ్చిందెవరని ప్రశ్నించారు. సజ్జల అనే జీతగాడు ఎస్పీపై ఒత్తిడి తెచ్చారా అని ప్రశ్నించారు. 

మహిళా మృతిపై సందేహాలు ఉన్నాయని అన్నారు. నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. 21 రోజుల్లోగా దిశ చట్టం కింద ముగ్గురు దోషులును శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధించాలన్నారు. 

మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాసనసభలో తన తల్లిని సన్న బియ్యం సన్నాసి అవమానిస్తారా..? అని అడిగారు. మరోవైపు మంత్రి రోజా తనపై చేసిన వ్యాఖ్యలకు లోకే ష్ కౌంటర్ ఇచ్చారు. రోజా మహిళలను కించపరిచేలా రోజా మాట్లాడటం సరికాదన్నారు. మహిళా మంత్రిగా ఉండి తనకు చీర పంపుతానంటావా అని ప్రశ్నించారు. చీరకట్టుకునే మహిళలను అవమానిస్తారా అని ప్రశ్నించారు. తనకు చీర పంపితే తన తల్లికి, ఆడపచులకు ఇస్తానని చెప్పారు. 

ఇక, దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం జరిగింది. వీరంకి Laxmi Tirupathamma అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో బుధవారం నాడు రాత్రి మరణించింది. ఆమెపై Rape  చేసి Murder  చేసినట్టుగా అనుమానిస్తున్నారు. Dead Body సమీపంలోనే Liquor  బాటిల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలోనే ఈ దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్