రావాలి జగన్, కావాలి జగన్ అని జైలు పిలుస్తోంది: నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

By telugu team  |  First Published Feb 14, 2020, 1:30 PM IST

ఐటీ సోదాలపై వైసీపీ తమపై చేస్తున్న విమర్శలకు టీడీపీ నేత నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఐటీ దాడుల ద్వారా కొండను తవ్వి ఎలుకను పట్టారని నారా లోకేష్ అన్నారు.


అమరావతి: ఐటి సోదాల విషయంలో తమపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు ఖండించారు. ఐటి దాడుల విషయంలో తమపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు వైఎస్ జగన్ కు లోకమంతా అవినీతి కనపడడంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదని, ఐటీ రైడ్స్ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్థమైందని ఆయన అన్నారు. ఈ ట్వీట్ ను వైఎస్ జగన్ కు ట్యాగ్ చేస్తూ పత్రికా ప్రకటన ప్రతిని జోడించారు. 

Latest Videos

undefined

Also Read: మాకేం సంబంధం: చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో ఐటి సోదాలపై యనమల

"రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టిడిపి కి ముడి పెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారు" అని ఆయన అన్నారు.

 

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు గారికి లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు. ఐటీ రైడ్స్ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్ధమైంది. (1/4) pic.twitter.com/FsaWqmsI3m

— Lokesh Nara (@naralokesh)

ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని, ఆ కంపెనీల్లో జరిగిన రైడ్స్ ను టీడీపీకి ముడిపెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు .16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అయినా తమకు అలాంటి కోరికలు లేవని లోకేష్ అన్నారు. 

చంద్రబాబు హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదని అంటూ అసత్యాల యాత్ర చేసిన వైఎస్ జగన్ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటపెడుతున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బాబు హయాంలో రాష్ట్ర యువతకు 9,56,263 ఉద్యోగాలు వచ్చాయని చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

Also Read: ఐటి శాఖ ప్రకటన: చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు

"ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్  ప్రమోషన్ పాలసీ పేరుతో వైకాపా ప్రభుత్వం రూపొందించిన పాలసీలో టిడిపి హయాంలో 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.51 లక్షల ఉద్యోగాలు ఒక్క ఉత్పత్తి రంగంలోనే వచ్చినట్టు ప్రకటించారు" అని ఆయన అన్నారు. "ఇవన్నీ వైకాపాలా కార్యకర్తలకు దొడ్డి దారిలో ఇచ్చిన ఉద్యోగాలు కావు. నిరుద్యోగ యువత కి బాబు ఇచ్చిన జాబులు" అని ఆయన అన్నారు.

click me!