రాజకీయాల్లోకి రానన్న నారా బ్రాహ్మణి

Published : Apr 24, 2017, 10:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
రాజకీయాల్లోకి రానన్న నారా బ్రాహ్మణి

సారాంశం

నారాబ్రాహ్మణి విజన్ 2022 : రాజకీయాల్లోకి రాను. 2022 నాటికి హెరిటేజ్ ను రు. 6 వేల కోట్లటర్నోవర్ కు తీసుకెళ్లాలి

రాజకీయల్లోకి వచ్చేది లేదు పొమ్మన్నారు, నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి

 

రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పడమే కాదు,  తాను ప్రధానంగా  హెరిటేజ్‌ వ్యవహారాలపైనే దృష్టి కేంద్రీకరిస్తానని  స్పష్టం చేశారు.

 

హెరిటేజ్ మెల్లిగా ఉత్తర భారతదేశానికి పరిచయం చేయడం గురించి చెబుతూ ఉత్తర భారతదేశంలో అయిదు హెరిటేజ్‌ ప్రాసెస్  యూనిట్లు ప్రారంభించనున్నట్లు బ్రాహ్మణి వెల్లడించారు.

 

అమె తన విజన్ 2022   ఏమిటో చెప్పారు. ఆ ఏడాదికి హెరిటేజ్‌ సంస్థ రూ.6వేల కోట్ల టర్నోవర్ సాధించాలని   లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెరిటేజ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ కూడా  అయిన బ్రాహ్మణి చెప్పారు.

 

బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, ఆమె వచ్చే ఎన్నికలలో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేయవచ్చని, చంద్రబాబుకి, కేశినేని నానికి మధ్య గ్యాప్ పెరిగేందుకు కూడా ఇదే కారణమని వినబడుతూ వస్తున్నది.

 

ఇలాంటపుడు బ్రాహ్మణి  రాజకీయాయ ప్రవేశం మీద తన అభిప్రాయమేమిటో చెప్పారు.

 

రాజకీయాలంటే తనకే మాత్రం అసక్తి లేదని, అసలు అలాంటి ఆలోచన కూడా తనకు లేదని ఆమె వెల్లడించారు.

 

అయితే, ఇలాంటి ప్రకటనలు అప్పటికి మాత్రమే చెల్లుతాయని, పరిస్థితులు  మారితే అభిప్రాయలు మారతాయని అందరికి తెలిసిందే. ఒక్కొక్క ప్రకటనకి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అర్థముంటుంది.

 

 

 

PREV
click me!

Recommended Stories

బీజేపీచేస్తున్న కుట్రను ఎదుర్కోడానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాం | YS Sharmila | Asianet News Telugu
Varudu Kalyani Comments on Pawan Kalyan: డైలాగ్స్ వద్దు చర్యలు తీసుకోండి | Asianet News Telugu