
చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి హైకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. అధికారం ఉంది కదా అని ఏం చేసినా చెల్లుబాటు కాదంటూ కోర్టు స్పష్టం చేసింది. రాజధాని పరిధిలోని పెనుమక గ్రామంలో రైతుల భూములు లాక్కోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా, వారి అభ్యంతరాలను పరిష్కరించకుండా భూ సేకరణ జరిపేందుకు లేదని ప్రభుత్వానికి తలంటిపోసింది.
రాజధాని పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో 904 మంది రైతులకు చెందిన 660 ఎకరాలను సేకరించాలని ప్రభత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దాంతో రైతులు వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సాయంతో కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్ లోని లొసుగులను ఆళ్ళ తరపు న్యాయవాది ఎత్తిచూపారు. దాంతో వ్యవసాయ భూములను సేకరించవద్దని చెప్పింది. రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ భూ సేకరణ చేయటమేమిటంటూ ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.