తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమని భువనేశ్వరి (Nara Bhuvaneshwari) సోమవారం తిరుపతిలో (Tirupati) పర్యటించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు (NTR Trust) తరపున ఇటీవల వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమని భువనేశ్వరి (Nara Bhuvaneshwari) సోమవారం తిరుపతిలో (Tirupati) పర్యటించనున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షలు కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో చాలా మంది నష్టపోయారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. రేపు తిరుపతి వెళ్లనున్న భువనేశ్వరి.. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు (NTR Trust) తరపున మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. మొత్తంగా 48 కుటుంబాలకు ఆర్ధిక సాయం చేయనున్నారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను భారీ వర్షాలు అతలకుతం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భువనేశ్వరి ఆదేశాల మేరకు.. ఎన్టీఆర్ ట్రస్టు వాలంటీర్లు పలు చోట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాలు అందించారు. తాగునీరు, పాలు, బ్రెడ్, భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఇక, కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే.
కాగా, ఏపీ అసెంబ్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల అనంతరం నారా భువనేశ్వరి ఏపీలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో తన భార్యను అవమానించారని చంద్రబాబు కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.