వేర్వేరు ఘటనలు: సురక్షితంగా బయటపడ్డ బాబు, భువనేశ్వరి

By narsimha lodeFirst Published Jan 30, 2024, 5:21 PM IST
Highlights

చంద్రబాబు, భువనేశ్వరిలు రెండు రోజుల వ్యవధిల్లో  ప్రమాదాల నుండి సురక్షితంగా బయటపడ్డారు.
 

అమరావతి: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఘటనల్లో  సురక్షితంగా బయటపడ్డారు.ఈ నెల  29న రాజమండ్రిలో  జరిగిన రా కదలిరా సభలో  చంద్రబాబు నాయుడు తృటిలో ప్రమాదం నుండి బయట పడ్డారు. స్టేజీపైకి కార్యకర్తలు పెద్దఎత్తున రావడంతో చంద్రబాడు స్టేజీపై నుండి కిందపడబోయాడు. సెక్యూరిటీ సిబ్బంది  చంద్రబాబును సురక్షితంగా కాపాడారు.

also read:స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ:ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ 

Latest Videos

మంగళవారంనాడు  చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గన్నవరానికి విమానంలో వచ్చారు. అయితే  విమానం ల్యాండింగ్ సమయంలో  ఇబ్బంది నెలకొంది. దరిమిలా విమానం కుదుపులకు గురైంది. అంతేకాదు విమానాన్ని పైలెట్  వెంటనే టేకాఫ్ చేశారు. విమానం ల్యాండింగ్ చేసే సమయంలో  ఫ్లైట్  వీల్ తెరుచుకోలేదు. ఈ విషయాన్ని గమనించిన పైలెట్ విమానాన్ని తిరిగి టేకాఫ్ చేశాడు.

also read:అటు అన్నా, ఇటు చెల్లి: కడప రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి?

 గాల్లో విమానం 20 నిమిషాలు చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత విమానాన్ని  పైలెట్ సురక్షితంగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.ఈ విమానంలో  చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు.  హైద్రాబాద్ నుండి  గన్నవరానికి  విమానంలో భువనేశ్వరి వచ్చారు.  ఇవాళ్టి నుండి  నాలుగు రోజుల పాటు  నిజం గెలవాలి పేరుతో  ప్రకాశం జిల్లా నుండి  యాత్రలో నారా భువనేశ్వరి నిర్వహించేందుకు  వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.   అయితే ఈ విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో  విమానంలోని ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే  చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిలు రెండు రోజుల్లో  ప్రమాదాల నుండి బయటపడ్డారు.

 

 


 

click me!