'మహా నాయకుడు' సినిమా: బాబు ఓటమిపై భువనేశ్వరీ ఆసక్తికరం

By narsimha lodeFirst Published 22, Feb 2019, 4:58 PM IST
Highlights

 1983 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన సందర్భంగా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరీ కీలకమైన కామెంట్స్ చేసినట్టుగా మహా నాయకుడు సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.

హైదరాబాద్: 1983 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన సందర్భంగా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరీ కీలకమైన కామెంట్స్ చేసినట్టుగా మహా నాయకుడు సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.

1983 ఎన్నికల్లో  చంద్రగిరి నుండి రెండో సారి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన చంద్రబాబునాయుడు ఓటమి పాలయ్యాడు. టీడీపీ అభ్యర్ధి చేతిలో ఆయన ఓడిపోతాడు. అప్పటికే ఆయన సినిమాటోగ్రఫీగా మంత్రిగా పని చేసినట్టుగా సినిమాలో చూపించారు.

ఈ ఎన్నికల ఫలితాలను  అప్పట్లో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు రేడియోలో వింటున్నట్టుగా సినిమాలో దృశ్యాలున్నాయి.  ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు ఆధిక్యంలో ఉన్నారని సినిమాలో చూపించారు. ఆ తర్వాత  202 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ  అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారని కూడ  సినిమాలో చూపారు.

అదే సమయంలో చంద్రగిరి నుండి పోటీ చేసిన చంద్రబాబునాయుడు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైనట్టుగా వార్తను రేడియోలో వింటారు. ఈ సమయంలో పురంధేశ్వరీ భువనేశ్వరీకి సారీ చెబుతారు. చంద్రబాబునాయుడు ఓడిపోయిన వార్త విన్న సమయంలో భువనేశ్వరీ కొంత బాధ పడినట్టుగా సినిమాలో చూపించారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మేడపై నుండి ఎన్టీఆర్ కిందకు దిగుతూ వస్తుంటారు. ఆ సమయంలో  చంద్రబాబును ఓడించానని బాధగా ఉందా అని భువనేశ్వరీని ఎన్టీఆర్‌ ప్రశ్నిస్తారు. ఆ సమయంలో  భువనేశ్వరీచెప్పిన డైలాగ్‌లు ఎన్టీఆర్‌కు హత్తుకొన్నట్టుగా సినిమాలో చూపించారు. ప్రజలే గెలిచారంటూ ఆమె డైలాగ్ చెబుతారు.

సంబంధిత వార్తలు

'మహా నాయకుడు' సినిమా: దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర ఇదీ...

మహా నాయకుడు' సినిమా: హైలైట్‌గా చంద్రబాబు రోల్
'మహానాయకుడు' సినిమా: దేవాన్ష్ స్పెషల్ రోల్

'మహానాయకుడు' సినిమా: నాదెండ్లే విలన్

Last Updated 22, Feb 2019, 4:58 PM IST