జగన్ కి గౌరు చరిత షాక్.. త్వరలో టీడీపీలోకి?

By ramya NFirst Published 22, Feb 2019, 4:38 PM IST
Highlights

వైసీపీ కి గౌరు చరిత షాక్ ఇవ్వనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.

వైసీపీ కి గౌరు చరిత షాక్ ఇవ్వనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. కర్నూలు జిల్లాలో నెమ్మదిగా వైసీపీ బలం తగ్గుతున్నట్లుగా అనిపిస్తోంది. అక్కడ కీలక నేతగా పేరున్న గౌరు చరిత ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎప్పుడైతే వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడో.. అప్పటి నుంచి పార్టీలో గౌరు చరిత ప్రాధాన్యం బాగా తగ్గిపోయిందట. ఇప్పటికే తనకు పాణ్యం టికెట్ కేటాయించారంటూ కాటసాని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ టికెట్ తనకేనని మొదటి నుంచి గౌరు చరిత భావించారు. ఇప్పుడ సడెన్ గా కాటసాని రావడంతో ఆమె పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలో పార్టీ మారాలనే నిర్ణయాన్ని గౌరు దంపతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6వ తేదీన గౌరు దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. ఈ విషయంలో ఇప్పటికే గౌరు చరిత తన కార్యకర్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవాకాశం ఉందని సమాచారం. 

Last Updated 22, Feb 2019, 4:38 PM IST