మీ తర్వాతే మమ్మల్ని పట్టించుకొంటారు: బాాబుపై భువనేశ్వరి

Published : Jan 01, 2020, 12:31 PM ISTUpdated : Jan 01, 2020, 01:12 PM IST
మీ తర్వాతే మమ్మల్ని పట్టించుకొంటారు: బాాబుపై భువనేశ్వరి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న దీక్షకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ మద్దతు ప్రకటించారు. 


అమరావతి: ప్రజల తర్వాతే  నన్ను, కుటుంబాన్ని తన భర్త పట్టించుకొనేవారన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరీ చెప్పారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఎర్రబాలెంలో రైతులు చేస్తున్న దీక్షలో చంద్రబాబుతో కలిసి భువనేశ్వరీ పాల్గొన్నారు.

Also read:రాజధాని రచ్చ: రైతులకు మద్దతుగా చంద్రబాబు దంపతుల దీక్ష

ఈ సందర్భంగా భువనేశ్వరీ రైతులతో మాట్లాడారు. నిద్రపోయే సమయంలో కూడ చంద్రబాబు రాష్ట్రం కోసం ఆలోచించేవారని ఆమె గుర్తు చేశారు.  మీ చంద్రన్న ఉన్నత ఆశయం కోసం పనిచేసేవారని ఆమె చెప్పారు. 

నా తోటి మహిళల బాధలను అర్ధం చేసుకోగలనని ఆమె చెప్పారు.  మీ ఉద్యమం బాగా  జరగాలని తాను కొరుకుంటున్నట్టుగా భువనేశ్వరీ ఆకాంక్షను వ్యక్తం చేశారు.రాజధాని రైతుల ఉద్యమానికి తమ కుటుంబం అండగా ఉంటుందని భువనేశ్వరీ హామీ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?