రాజమండ్రి జైలులో బాబు: భువనేశ్వరి, బ్రహ్మణి ములాఖత్

By narsimha lode  |  First Published Oct 3, 2023, 1:28 PM IST

టీడీపీ చీఫ్  చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు  ఇవాళ ములాఖత్ అయ్యారు. 
 


రాజమండ్రి: టీడీపీ చీఫ్ చంద్రబాబుతో  నారా భువనేశ్వరి, బ్రహ్మణి, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారంనాడు ములాఖత్ అయ్యారు.చంద్రబాబును జైల్లో ఆరో దఫా  ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు.  ఈ ఏడాది సెప్టెంబర్  9వ తేదీన ఏపీ సీఐడీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసింది. దీంతో  ఈ నెల 5వ తేదీ వరకు  స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.దీంతో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

సెప్టెంబర్ 12, 14,18, 25,29 తేదీల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆయనను కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు  పార్టీ నేతలు కూడ  చంద్రబాబును కలుస్తున్నారు.  అచ్చెన్నాయుడు, నారాయణ,  నిమ్మకాయల చినరాజప్పలు రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిశారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబుపై కోర్టుల్లో పీటీ వారంట్లు దాఖలు చేశారు పోలీసులు.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ నిర్వహించింది.ఈ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Latest Videos


 

click me!