ఈ నెల 6వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ ను న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది.
అమరావతి: ఈ నెల 6వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ న్యూఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం కూడ జోక్యం చేసుకోవాలని నారా లోకేష్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయమై వీరిద్దరితో చర్చించనున్నారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై కేంద్రమంత్రులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు సీఎం జగన్ న్యూఢిల్లీలోనే ఉంటారని సమాచారం.
బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని గత మాసంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. వారాహి యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. ఇవాళ బీజేపీ ఏపీ పదాధికారుల సమావేశం జరగనుంది.